ఫర్టిలైజర్ షాప్ లోకి వచ్చినవి వచ్చినట్లే ఖతం…

ఫర్టిలైజర్ షాప్ లోకి వచ్చినవి వచ్చినట్లే ఖతం…

టేకుమట్ల, ఆంధ్రప్రభ : దేశానికి అన్నం పెట్టే రైతుకు కష్టాలు కొత్తవి కావు. ప్రకృతి కరుణించకపోయినా, కనీసం విధానాలైనా ఆదుకుంటాయన్న ఆశతోనే రైతు సాగు చేస్తాడు.. కానీ నేటి పరిస్థితుల్లో ప్రకృతి ప్రతికూలతల కంటే ప్రభుత్వ విధాన లోపాలే రైతును ఎక్కువగా గాయపరుస్తున్నాయన్న భావన బలపడుతోంది. ముఖ్యంగా యూరియా సరఫరా విషయంలో అమలవుతున్న విధానాలు.. రైతుకు ఊరటనివ్వాల్సింది పోయి రైతును మరింత సంక్షోభంలోకి నెట్టుతున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అన్నదాతలకు యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి.

భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలోని ఫర్టిలైజర్ షాపు ల్లో యారియా నిల్వలను యాప్ లో చూడగా ‘జీరో’ చూపించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. వరిలో కలుపు తీత తర్వాత, మక్క పంట కంకి దశ లో ఉన్నదని సకాలంలో యూ రియా వేస్తేనే పంట ఎదుగుతుందని, ఇప్పుడు యారియా అందకపోతే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. యారియా కోసం అవస్థలుపడుతున్నామని వాపోయారువరి, మొక్కజొన్న, తదితర పంటల ను పండిస్తారు. ఇప్పుడు వరి కలుపుతీత తర్వాత యూరియా చల్లుకొనే రైతులకు, మొక్కజొన్న కంకి దశలో ఉండటంతో వరి, మొక్కజొన్న రైతులు యూరియా కోసం ఎదురుచూస్తున్నారు.

ఆయా ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎక్కడ కూడా యూరియా నిల్వలు చూపించకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సకాలంలో యూరియా అందకపోతే పంటల దిగుబడి రాక అప్పుల పాలవుతామని దిగులు చెందుతున్నారు. ఇతర మండలాల్లోని షాపుల నుంచి తీసుకోవాలంటే రవాణా ఖర్చులు రానుపోనుకు తడిసిమోపు అవుతాయని రైతులు వాపోతున్నారు.

  • లోడ్ వచ్చిన కొద్ది సేపటికే..

యూరియా లోడ్ ఫర్టిలైజర్ దుకాణానికి వచ్చాక డీలరు ఆన్లైన్లో నమోదు చేసిన పది నిమిషాల్లోనే అందుబాటులో వారు ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని తీసుకెళ్తున్నారని, మిగతా వారికి దొరకక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. లోడ్ వచ్చాక డీలర్ ఆన్లైన్లో నమోదు చేస్తేనే యాప్లో నిల్వలున్నట్లు చూపిస్తున్నాయని, లోడ్ వచ్చిన సమాచారం డీలర్ ద్వారా తెలుసుకున్న రైతులకే ముందుగా దొరుకుతుందని చెబుతున్నారు. సమయానికి బుకింగ్ చేయని వారికి నిరాశే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. దీనికి తోడు యూరియాను బుకింగ్ కోసం యాప్ను తీసుకురావడంతో స్మార్ట్ ఫోన్ లేక తిప్పలుపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యారియాను సకాలంలో అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

Leave a Reply