Urban | ప్రాణత్యాగ ఫలితమే రాష్ట్ర అవతరణ

Urban | ప్రాణత్యాగ ఫలితమే రాష్ట్ర అవతరణ
- మంత్రి డోల వీరాంజనేయ స్వామి
Urban | ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు : అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర అవతరించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ(Social Welfare Department) మంత్రి బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా స్థానిక సీవీఎన్ రీడింగ్ రూమ్ ఎదురుగా ఉన్న అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు విగ్రహానికి వీరాంజనేయ స్వామి, కలెక్టర్ పి.రాజాబాబు, సంతనూ తలపాడు శాసనసభ్యులు బీఎన్ విజయ్ కుమార్, గిద్దలూరు శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు భాష మాట్లాడే ప్రజలందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని 58రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు(Potti Sriramulu) ఆమరణ నిరాహారదీక్ష చేసి 15 కేజీల బరువు తగ్గిన తర్వాత ప్రజలందరూ కూడా ఆయనకు సంఘీభావం తెలిపి మహా ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేసి మరణించిన 10నెలల తర్వాత ప్రత్యేక ఆంధ్రరాష్ట్రాన్ని ప్రభుత్వం ప్రకటించిందని ఆయన చెప్పారు.
కార్యక్రమంలో బీఎన్. విజయ్ కుమార్ గిద్దలూరు శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్(Urban Development) అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, జాయింట్ కలెక్టర్ ఆర్ .గోపాలకృష్ణ, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి లక్ష్మణనాయక్, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు అర్బన్ తహసిల్దార్ మధు సూదన్ రావు, ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
