దేవాలయంలో ప్రత్యేక పూజలు..

దేవాలయంలో ప్రత్యేక పూజలు..
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం లో బుధవారం ప్రధాన అర్చకులు ద్వారకనాథ్ చార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. చంద్ర గ్రహణం సందర్భంగా ఆగమశాస్త్ర నియమవాళి ప్రకారం మంగళవారం ఉదయం దేవాలయ ద్వారా లు తాత్కాలికంగా మూసి వేసిన విషయం తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున దేవాలయ శుద్ధి, సంప్రోక్షణ నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు మయూరం బాలాజీ చార్యులు, రామకృష్ణ, గుండురావు, మారుతి
ప్రసాద్ పాల్గొన్నారు.
