మహాసభల గోడపత్రికల ఆవిష్కరణ..

జర్నలిస్టుల మహాసభల గోడపత్రికలను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటే శ్వర్‌రెడ్డి


భూత్పూర్, సెప్టెంబర్‌ 3 (ఆంధ్రప్రభ):
తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (టీయూడ బ్ల్యూజే–హెచ్‌143) ఆధ్వర్యంలో ఈ నెల 13న మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ లోని క్రౌన్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించనున్న 3వ జర్నలిస్టుల మహాసభల గోడపత్రికను మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటే శ్వర్‌రెడ్డి గురువారం ఆవిష్కరించారు.

అన్న సాగర్‌లోని ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమంలో గోడపత్రికను ఆవిష్కరించి, మహాసభల నిర్వహణకు సంబంధించిన వివరాలను యూనియన్‌ నాయకులు వెల్లడించారు. జర్నలిస్టుల సమస్యలు, వృత్తిపరమైన అంశాలపై మహాసభల్లో చర్చించ నున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఆల శ్రీకాంత్‌రెడ్డి,మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బస్వరాజు గౌడ్‌,నారాయణ గౌడ్‌,మురళీధర్‌ గౌడ్‌, శ్రీనివాస్‌రెడ్డి,సత్య నారాయణ,అశోక్‌గౌడ్‌, యూనియన్‌ నాయకులు శివ,చింతకాయల వెంకటేష్‌, రవి,నరేందర్‌గౌడ్‌, మణికంఠ,యాదగిరి, శంకర్‌నాయక్‌,విజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.