University | మునగాల యాదగిరి ఆచార్యులకు సన్మానం

University | మునగాల యాదగిరి ఆచార్యులకు సన్మానం

University | మునుగోడు, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన పంచాంగ సిద్ధాంతి, జ్యోతిష్యులు మునగాల యాదగిరి ఆచార్యులు ఈ నెల 14న మధురైలో జ్యోతిష్య యోగ శాస్త్ర విశ్వవిద్యాలయం(Yoga Shastra University) ఫ్లోరిడా ద్వారా జ్యోతిష్య పరిశోధనలో డాక్టరేట్ పట్టా పొందారు.

నక్షత్ర నాడీ సిద్ధాంతంపై 2వ‌ పద్ధతి జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం ఎలాంటి గ్రహ స్థితి వలన పొందుతారనే విషయంపై ప్రో.డా. శరవన్ కుమార్ పర్యవేక్షణలో పరిశోధన చేశారు. జ్యోతిష్య యోగ శాస్త్ర విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ప్రో.డా.ఎన్ వి.ఆర్ రాజా, సి.ఇ.ఓ ప్రో.డా హైమావతి పలువురు జ్యోతిష్య శాస్త్ర పరిశోధకుల సమక్షంలో మునగాల యాదగిరి ఆచార్యులు డాక్టరేట్ పట్టా(Doctorate Degree) అందుకున్నారు.

ఈ సందర్భంగా మునుగోడు పట్టణ 3వ వార్డు మెంబర్ పందుల ప్రియాంక లింగస్వామి వారిని శాలువాతో సన్మానించారు. పట్టణ వ్యక్తి కావడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ ర్యక్రమంలో నాగ శేఖర్, రేవెల్లి సైదులు, పామనగుళ్ళ నవీన్ కుమార్, మునగాల సీతయ్య, పందుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply