కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చికిత్స‌

న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పి. నడ్డా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను న్యూఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS)లో చేర్పించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో అడ్డంకులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

దీంతో అడ్డంకులను తొలగించి రక్తప్రసరణను పునరుద్ధరించేందుకు వైద్యులు జేపీ నడ్డాకు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. చికిత్స అనంతరం ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఎయిమ్స్‌ వర్గాలు తెలిపాయి. ప్ర‌స్తుతం జేపీ నడ్డాను కార్డియాలజీ విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం నిరంతరం పరిశీలిస్తోంది.