AP | అన్నా క్యాంటీన్ లో భోజనం చేసిన కేంద్ర మంత్రి

AP | కోటబొమ్మాళి(శ్రీకాకుళం), ఆగస్టు 27(ఆంధ్రప్రభ బ్యూరో): కోటబొమ్మాళి మండలం కొత్తపేట లో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన కేంద్ర మంత్రి.. అక్కడే ఉన్న అన్నా క్యాంటీన్ లో స్థానికులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. తొలుత మెయిన్ రోడ్ లో ఉన్న అన్నా క్యాంటీన్ కు చేరుకుని స్థానికులకు భోజనాలను వడ్డించారు. అనంతరం స్థానికులతో కలసి ఆయన కూడా సామాన్యుడిలా ప్లేట్ పట్టుకుని భోజనం చేశారు.

ఈసందర్భంగా అక్కడివారితో కలసి భోజనం నాణ్యత, పరిసరాల శుభ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. 5 రూపాయలకే నాణ్యమైన, రుచికరమైన భోజనం దొరుకుతోందని, ప్రతీ రోజూ నాణ్యతలో, రుచిలో రాజీ పడరని స్థానికులు రామ్మోహన్ నాయుడు ప్రశ్నకు బదులివ్వడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పప్పు, పెరుగు, రసం అన్నింటినీ రుచి చూస్తూ అక్కడి వారి తో కలసి మధ్యాహ్న భోజనం చేశారు.