బాబా తరచుగా తన భక్తులతో తనకు, తన ఫొటోకూ భేధమేమీ లేదని అంటుండేవారు. మన: పూర్వ కంగా, భక్తి శ్రద్ధలతో పవిత్రమైన మనస్సుతో శ్రీ సాయి ఫొటోకు పూజ చేస్తే సాక్షాత్తూ శ్రీ సాయికి పూజ చేసినట్లే నని, తాను వెంటనే అనుగ్రహస్తానని శ్రీ సాయి స్వ యంగా తన భక్తులకు చెప్పడమేకాక ఆచరణ పూర్వకంగా ఎన్నోసార్లు చూపించారు.
అలాంటి లీలలను కొన్ని స్మరించుకుందాం!
బొంబాయిలో ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తున్న అప్పా సాహబ్ కులకర్ణి అను నతనికి ఒకసారి అతని స్నేహతుడు బాలాసాహబ్ భాటే బాబా ఫొటోను కానుకగా ఇచ్చాడు. కుల కర్ణి ఆ ఫొటోను తన పూజా మందిరంలో ప్రతిష్టించుకొని నిత్యం షోడశోపచారాలతో పూజాది కార్యక్రమాలను నిర్వర్తి స్తుండేవాడు. ఒక్కసారైనా శిరిడీ వెళ్ళి శ్రీ సాయి దర్శనం చేసు కుందామని అనుకున్నాడు కాని ఉద్యోగ బాధ్యతల వలన అది సాధ్యం కాలేదు.
1917వ సంవత్సరంలో కులకర్ణికి ఠాణకు బదిలీ అయ్యింది. ఠాణలో వుండగా భివండీకి ఆఫీసు పర్యటన మీద వారం రోజుల కోసం కులకర్ణి వెళ్ళాడు. మూడవ రోజున మధ్యా#హ్నం పన్నెండు గంటలకు అచ్చం శ్రీ సాయిలా వున్న ఒక ఫకీరు కులకర్ణి ఇంటికి వచ్చి దక్షిణ అడిగాడు. ఆయన ముఖ కవళికలు సాయితో సరిపోవడం వలన ”మీరు శ్రీ సాయి బాబాగారా?” అని కులకర్ణి భార్య అడిగింది.
”లేదు, నేను భగవంతుడి సేవకుడను. ఆయన ఆదేశాను సారం మీ యోగక్షేమాలను కనుక్కోవడానికి వచ్చాను” అని అన్నారు. కులకర్ణి భార్య ఇచ్చిన రూపాయిని తీసుకొని ఒక ఊదీ పొట్లాం ఇచ్చి నిత్యం బాబా ఫొటోతో పాటు పూజ చేస్తే మంచి జరుగుతుందని చెప్పి ఆ ఫకీరు వెళ్ళిపోయాడు.
భివండీలో తన గుర్రానికి తీవ్రమైన సుస్తీ చేయడంతో కులకర్ణి తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకొని ఆ రోజు సాయంత్రమే ఇల్లు చేరుకున్నాడు. ఫకీరు గురించి భార్య ద్వా రా విని, ఆయన దర్శనం తనకు లభించనందుకు బాధపడ్దా డు. తానే గనక ఇంట్లో వుంటే రూపాయికి బదులు పది రూపా యలను దక్షిణగా ఇచ్చి వుండేవాడినని అనుకున్నాడు. అతనికి మనసులో బలంగా తమ ఇంటికి వచ్చినవారు శ్రీ సాయే అయి వుంటారని అనిపించింది. వెంటనే భోజనం కూడా మానేసి ఆ ఊరిలో వున్న అన్ని ప్రదేశాలను వెదికాడు కానీ ప్రయోజనం లేకపోయింది. నిరాశతో ఇంటికి వచ్చి భోజనం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. ఖాళీ కడుపుతో భగవంతుడిని వెదకరా దన్న శ్రీ సాయి ఉపదేశం ఇక్కడ మనమందరం గుర్తుంచుకో వాలి. కొద్దిసేపట్లో అతని స్నేహతుడు వచ్చి వ్యాహ్యాళికి రమ్మ ని ఆహ్వానించాడు. మధ్య మార్గంలో వారికి ఒక ఫకీరు కనిపిం చాడు. ఆయనను చూడగానే మధ్యాహ్నం తమ ఇంటికి వచ్చి న ఫకీరులాగే అనిపించింది కులకర్ణికి. ఆ ఫకీరు వెంటనే చేయి చాచి దక్షిణ అడుగగా కులకర్ణి ఒక రూపాయి ఇచ్చాడు. ఫకీరు మళ్ళీ దక్షిణ అడగడంతో తనవద్ద మిగిలిన రెండు రూపాయ లను ఇచ్చాడు. ఫకీరు సంతృప్తి చెందకపోవడంతో స్నేహతుని వద్ద నుండి మూడు రూపాయలు అప్పు తీసుకొని ఇచ్చాడు. ఫకీరు ఇంకా దక్షిణ అడగడంతో వారిని తన ఇంటికి మర్యా దపూర్వకంగా తీసుకువెళ్ళి మూడు రూపాయలు దక్షిణగా (మొత్తం తొమ్మిది రూపాయలు) ఇచ్చాడు. ఫకీరు మళ్ళీ దక్షిణ అడగడంతో కులకర్ణి తన వద్ద వున్న పది రూపాయల నోటును ఇచ్చి వేసాడు. ఆ ఫకీరు చిరునవ్వుతో తొమ్మిది రూపాయలను ఆశీర్వదించి వారికి తిరిగి ఇచ్చివేసాడు. ఒక ఊదీ పొట్లాన్ని అప్పా కులకర్ణికి ఇచ్చి నిత్యం పూజించుకొమ్మని చెప్పి, ఏ చీకు చింతా, దిగులు లేకుండా ఆనందంగా వుండమని చెప్పి వెళ్ళి పోయాడు.
ఈవిధంగా శ్రీ సాయి ఫకీరు రూపంలో వచ్చి అప్పా కుల కర్ణిని ఆశీర్వదించారు. ఇస్తామన్న పది రూపాయల దక్షిణను ముక్కు పిండి వసూలు చేసి, తొమ్మిది రూపాయలను పవిత్ర పరచి తిరిగి ఇచ్చివేసారు. తొమ్మిది నాణాలు నవ విధ భక్తికి సంకేతం. శ్రీ సాయి తన సమాధి సమయంలో లక్ష్మీబాయి శిం దేకు తొమ్మిది నాణాలను ఇచ్చి నవవిధ భక్తి గూర్చి విపులంగా తెలియజేసారు. భక్తుడు తన వద్దకు ఉద్యోగ బాధ్యతల దృష్ట్యా రాలేకపోతే, తానే స్వయంగా భక్తుని వద్దకు వచ్చి ఆశీర్వదిం చారు శ్రీ సాయి.
అప్పాసాహబ్ కులకర్ణి త్వరలోనే శిరిడీ దర్శనం చేసా డు. అప్పుడు శ్రీ సాయి యొక్క తల వెంట్రుక ఒకటి అతనికి చిక్కింది. ఆ తల వెంట్రుక, ఫకీరు ఇచ్చిన ఊదీ పొట్లాన్ని ఒక తాయెత్తులో పెట్టి తన చేతికి కట్టుకున్నాడు. నాటి నుండి శ్రీ సాయి అనుగ్రహం వలన అతని జీవన గతి మారిపోయింది. అప్పా సాహబ్ కులకర్ణి స్వతాహాగా చాలా తెలివైనవాడు. కాని అతనికి జీతం నలభై రూపాయలు మాత్రమే దొరుకుతూ వుందేది. శ్రీ సాయి ఊదీ, తల వెంట్రుకలను తాయెత్తు క్రింద చేతికి కట్టుకున్ననాటి నుండి లక్ష్మీదేవి కరుణ అపూర్వంగా లభించింది. అతని అదాయం ఎన్నో రెట్లు ఎక్కువైంది. మంచి పలుకుబడి, అధికారం, హోదా లభించాయి. దైవభక్తి కూడా ఎన్నో రెట్లు వృద్ధి చెందింది. శ్రీ సాయి పూజ, నామస్మరణ, సం కీర్తన, ఆరతి పాడడం, అభాగ్యులకు సేవ వంటి సత్కార్యాలతో మనస్ఫూర్తిగా పాల్గొని శ్రీ సాయినాధుని సంపూర్ణ అనుగ్రహ, కరుణా కటాక్షాలకు పాత్రుడు అయ్యాడు. సాయి సేవ చేసుకు నేవారికి ఇహపర కానుకలేకాక అధ్యాత్మిక సిద్ధి కూడా పరిపూ ర్ణంగా లభిస్తుందన్న నగ్న సత్యాని కి ఈ లీల
ఖాళీ కడుపుతో దేవుడినివెతకలేరు…
Advertisement
తాజా వార్తలు
Advertisement