కర్నూలు – ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఫెవోర్డ్ ఏపీ కర్నూలు చాప్టర్,ఫ్యాన్సా ఆధ్వర్యంలో వరల్డ్ వాటర్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్. మధుసూదన్, అధ్యాపకులు డాక్టర్.వాజిద్,అక్తర్ బాను, రవి ప్రకాష్,ఫెవోర్డ్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఏవి రమణయ్య, జిల్లా అధ్యక్షు మధు బాబు, కార్యదర్శి సర్దార్ బాష,కోశాధికారి కొమ్ముపాలెం శ్రీనివాసులు, సభ్యులు పి. వెంకటేశ్వర్లు తిమ్మప్ప,ఎం.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వాల్యుయింగ్ వాటర్, జలమే జీవనాధారం గురించి వివరించారు.రాష్ట్ర అధ్యక్షులు ఏవి రమణయ్య నీటి వినియోగము గురించి వివరిస్తూ భూగోళం మూడు వంతులు నీటితో నిండి ఉందని దీనిలో మూడు శాతము మాత్రమే మంచినీరు, 97శాతము ఉప్పునీరు ఈ మూడు శాతం నీటి లో కేవలం 0.26 శాతము మాత్రమే మానవాళి వినియోగానికి ఉపయోగకరము అని అన్నారు.ఈ నీరు భూమి ఉపరితలంలో నదులు కాలువలు, చెరువులు, కుంటలు, సరస్సులు, భూగర్భజల రూపంలో ఉన్నదని అన్నారు. సురక్షిత నీరు పొందాలంటే కలుషిత నీరు దుష్పరిణామాలు గ్రహించాలన్నారు త్రాగునీటి కలుషిత నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ నీటి వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వాన నీటిని సంరక్షణ కార్యక్రమాలను చేపట్టి వాటిని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement