Monday, November 18, 2024

డబుల్ బెడ్రూంల కోసం కలెక్టరేట్ ముట్టడించిన మహిళలు కార్మికులు

కామారెడ్డి ప్రభన్యూస్. కామారెడ్డి కలెక్టరేట్ ను డబుల్ బెడ్రూంలో కేటాయించాలని డిమాండ్ చేస్తూ మహిళలు కార్మికులు పెద్ద ఎత్తున సోమవారం నాడు ముట్టడించారు. కలెక్టరేట్ ముందు ధర్నా శిబిరంలో ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ డబుల్ బెడ్ రూమ్ లో గురించి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన తొమ్మిది ఏళ్ల కాలంలో ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ లు కేటాయించలేదని కామారెడ్డి జిల్లాలో కేవలం బాన్సువాడలో మాత్రమే నిర్మించారని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గ ల లో కార్మికులకు మహిళలకు ఇల్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్లు కేటాయించ లేదని ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ విమర్శించారు. టిఆర్ఎస్ పాలనలో కొంతమంది వ్యక్తులు మాత్రమే వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని ప్రొఫెసర్ యాదవ్ విమర్శించారు. ఉద్యోగ నియామకాలు భర్తీ జరగలేదని కేవలం నోటిఫికేషన్లు మాత్రమే వచ్చాయని యువతను మభ్యపెడుతున్నారని ప్రొఫెసర్ యాదవ్ దుయ్యబట్టారు. వేలాది ఎకరాల భూములను కొల్లగొట్టడానికి ధరణి సృష్టించారని భూములు ఆక్రమించుకోవడానికి వీఆర్ఏలను వీఆర్వోలను నియమించుకున్నారని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తే ధర్నాలు చేస్తే అణచివేసేందుకు పోలీసులను భర్తీ చేశారని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదని ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ విమర్శించారు.

ప్రజల సంక్షేమం ప్రజలకు అభ్యున్నతి పథకాలు ఇవ్వడానికి పాలకులు ధైర్యం చేయడం లేనిదే ఆరోపించారు. విద్యా వ్యవస్థ తీవ్రంగా నష్టపోయిందని 12 ఏళ్లుగా టీచర్ ఉద్యోగాల భర్తీ లేక స్కూల్లు దయనీయ పరిస్థితిలో ఉన్నాయని విద్యార్థులకు చదువులు చెప్పేవారు కొత్తగా నియమాలు లేకపోవడంతో విద్యా వ్యవస్థ అద్వాన్నంగా తయారైందని ప్రొఫెసర్ యాదవ్ విమర్శించారు. మానవ వనరులు అభివృద్ధి జరిగినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు మానవనరులు చాలా అద్భుతమైనవని వాటిని అభివృద్ధి చేయకుండా అణచివేస్తున్నారని ప్రొఫెసర్ యాదవ్ విమర్శించారు. తెలంగాణలో పాలకులు విద్యారంగాన్ని వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసి ధ్వంసం చేశారని ఆరోపించారు. తెలంగాణ సర్కారు విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా నిధులు కేటాయించకుండా పాలకులు విస్మరిస్తున్నారని దాంతో విద్యారంగం వైద్యరంగం తీవ్రంగా నష్టపోయిందని ప్రజలు పేదలు పిల్లలు విద్యా రంగానికి దూరమయ్యారని ఆరోపించారు. కెసిఆర్ పాలన 9 ఏళ్ళలో అక్కడక్కడ డబుల్ బెడ్ రూమ్ లు కట్టారు కానీ వాటిని పేదలకు కేటాయించలేదని బిఎల్ఎఫ్ నాయకులు ఆరోపించారు. నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లు శిథిలావస్థకు చేరుకున్నాయని ఆరోపించారు. కామారెడ్డి జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లని పేదలకు కేటాయించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఎస్ సీద్దరాములు స్పష్టం చేశారు. కలెక్టర్ ను ముద్రించిన వారిలో పెద్ద ఎత్తున మహిళలు, బిఎల్ఎఫ్ నాయకులు వెంకట్ , సీద్దరాములు, సాయి కృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement