Wednesday, November 20, 2024

అయోద్య పులకించిన వేళ…శ్రీరామ పట్టాభిషేకం!

భరధ్వాజ ముని ఆశ్రమం నుంచి రాముడు తదితరులు భరతుడు ఉన్న నందిగ్రామం చేరారు. అక్కడికి చేరగానే ముందుగా లక్ష్మణునికి, సుగ్రీవునికి, విభీషణుడికి కేశ ఖండన చేయించాడు రాముడు. ఆ తరువాత తాను చేయించుకుని శిఖను పెట్టుకున్నాడు. రాజమాతలు కౌసల్య, సుమిత్ర, కైకేయిలు సీతకు దగ్గరుండి కేశాలంకరణ చేసి ఆభరణాలతో అలంకరించారు. అలాగే రాముని మిత్రులు సుగ్రీవుని, విభీషణుల భార్యలకు స్వయంగా అలంకరణ చేసారు.
నందిగ్రామం నుంచి అయోధ్యకు పట్టాభిషేకానికి ఊరేగింపుగా బయలుదేరింది రామ సేన. శత్రుఘ్నుడు స్వయంగా రాముడి రథాన్ని నడపడానికి గుర్రాల కళ్లేలను పట్టుకున్నాడు. సీతతోపాటు సుగ్రీవుని విభీషణుల భార్యలు మరో రథంలో బయలుదేరారు. భరతుడు బ్రాహ్మణులను, పురోహతులతో పట్టాభిషేక ఏర్పాట్లపై చర్చిస్తున్నాడు. ఊరేగింపులో ముందుగా దశరథుడు ఉపయోగించిన భద్రగజంపై సుగ్రీవుని కూర్చోపెట్టారు. ఆ తరువాత పురోహతులు, మునులు నడిచారు. తరువాత కన్యలను పవిత్ర జలములతో, వారి వెనుక సుహాసునులను మధుర పదార్ధములతో, వారి తరువాత మంగళ వాయిద్యములతో చివర కు పెద్దలతో ఊరేగింపు సాగుతున్నది. శ్రీరాముడు, ఇతర ప్రముఖులు ఎక్కిన రథం ఊరేగిం పు మధ్యలో ఉంది. ఊరేగింపు అయోధ్య చేరగానే ముందుగా రాముడు మిత్రుడు సుగ్రీవునికి అంత:పురంలో తన సౌధం ఇవ్వాలని భరతుడ్ని ఆదేశించాడు. దాంతో భరతుడు అన్ని ఏర్పాట్లుచేసి సుగ్రీవునికి విడిదిగా ఇచ్చాడు. పట్టాభిషేకానికి 500 నదుల జలం కావాలని రుషులు తెలుపగా, సుగ్రీవుడు వానరవీరులతో తాను తెప్పిస్తానని హామీ ఇచ్చాడు. వానర వీరులు బ్రహ్మ ముహూర్తంలో వెళ్లి పట్టాభిషేక సమయానికి ఈ లోకంలో ఉన్న 500 నదుల జలాలను తీసుకువచ్చారు. హనుమతో సహా మరో నలుగురు నాలుగుదిక్కులా ఉన్న సము ద్రపు జలాలు తెచ్చారు. 500 నదీజలాలతో పట్టాభిషిక్తుడైన ఏకైక రాజు రాముడు కావడం విశేషం. పట్టాభిషేకానికి వశిష్టుడు, గౌతముడు, విజయుడు, జాబిలి తదితర ఋషులు వచ్చారు. పట్టాభిషేక సమయం ఆసన్నమైంది. శ్రీరాముడు పట్టమహషి సీతమ్మతో సర్వాలం కారభూషితుడై సింహాసనంపై ఆసీనులైనాడు. ఒకపక్క సుగ్రీవుడు, మరోపక్క విభీషణుడు చామరములతో విసురుతుండగా శత్రుఘ్నడు తెల్లని ఛత్రం పట్టాడు. సీతారాముల పీఠం క్రింద హనుమ కూర్ఛున్నాడు. రాముడు రత్నఖచిత హారాన్ని సుగ్రీవుడికి బహూకరించా డు. వానర యువరాజు అంగదుడికి వజ్రాల భుజకీర్తులను ఇచ్చారు. విభీషణుడికి కూడా మంచి పగడాల హారాన్ని ఇచ్చాడు. అలా వానర, రాక్షస వీరులకు శ్రీరాముడు అందమైన ఆభరణాలను బహూకరించి సంతోషపెట్టారు. ఆ తరువాత లక్ష్మణుని యవరాజ్య పట్టాభిషి క్తుడ్ని చేయాలని తలచాడు. అప్పుడు ”ఓ ధర్మం తెలిసినవాడా! సౌమిత్రీ నీవు యవరాజ్య పట్టాభిషిక్తుడివికా” అన్నారు. తనతో పాటు 14 సంవత్సరాలు అరణ్యవా సం చేసి కష్టపడ్డాడని రాముడు అలా అడిగాడు. ”నా కంటే పెద్దవాడు భరతుడు ఉండగా నేను యవరాజ్య పదవి ఎలా తీసుకుంటాను, నాకు వద్దు, భరతన్నయ్య కే ఇవ్వండి” అన్నాడు లక్ష్మణుడు.
రాముడు ధర్మం తెలిసినవాడు కనుక ఈ విష యంలో నిర్ణయం తీసుకునే అవకాశం లక్ష్మణునికే ఇచ్చాడు. తనను అడగలేదని సంశయం పోవడా నికే ధర్మం తెలిసినవాడా అని సంబోధించాడు. భరతుడికే యవరాజ్య పట్టాభిషేకం చేసారు.
ఇదిలా ఉండగా ఈ సంబరాన్ని చూసి ఇద్దరు కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఒకడు విభీషణుడు. ”అ య్యో! మేము ముగ్గురు అన్నదమ్ములమే. అతి బలవం తులమే. మాలో మేము విబేధించుకుని చివరకు రావ ణ, కుంభకర్ణులు చనిపోగా నేను మాత్రమే మిగి లాన ”ని వాపోయాడు విభీషణుడు. ”మా అన్న వాలి లోకభీకర బలశాలి. ఆయన బ్రతికి ఉన్నంతకాలం తన్నుకున్నాం. ఇప్పుడు నేను మాత్రమే మిగిలాన”ని సుగ్రీవుడు విలపించాడు.
రామలక్ష్మణ భరతశత్రుఘ్నలను చూస్తే అన్నదమ్ములంటే ఇలా ఉండాలి. వారి అనుబంధం లోకానికి అనుసరణీ యమని వారిని చూసి సుగ్రీవ, విభీషణు లు మెచ్చుకున్నారు. అందరికీ బహుమ తుల ప్రదానం అనంతరం బ్రహ్మ దేవుడు పంపిన రత్నఖచిత కిరీటాన్ని ఇక్ష్వాకు వం శ పురోహతుడు వశిష్టుడు మునుల ఆశీర్వాదాల మధ్య శ్రీరాముని శిరస్సుపై అలంకరించడంతో రాముడు రాజా రాముడు అయ్యాడు.
శ్రీరాముడు రాజు కాగానే లోకాలన్నీ చల్లబ డ్డాయి. ప్రజల మనసులు కూడా శాంత చిత్తమయ్యా యి. అంత సీతమ్మ తన మెడలోని ముత్యాల హారాన్ని తీసి రాముడు వంక చూసింది.
ఆమె మనస్సు తెలిసినవాడు కనుక కళ్లతోనే సంజ్ఞ చేసాడు. అంత సీతమ్మ ఆ హారాన్ని హనుమకు ఇచ్చింది. పచ్చని శరీరంతో ఉన్న హనుమ ఈ ఆభరణం వేసుకోవటంతో మరింత మెరిసిపోతున్నారు.
రాముడు 39వ సంవత్సరంలో పట్టాభిషక్తుడై రాజ్యాన్ని చేపట్టాడు. 12వ ఏట సీతమ్మను చేపట్టాడు. 12 ఏళ్లు అయోధ్యలో ఉన్నారు. ఆ తరువాత 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసారు. రాజా రాముడిగా తన తమ్ములతో 11వేల సంవత్సరాలు పరిపాలిం

చాడు. ఆయన రాజ్యంలో అపమృత్యు భయంలేదు. ప్రజలు మనవడు, మునిమనవలను చూసే అసువులు బాసారు. విషపురుగులవల్ల మృత్యువు ఎవరికీ రాలేదు. ప్రజలంతా ఆనం దంగా, సుఖంగా జీవించారు. పేదరికం, భయం లేని జీవితాన్ని గడిపారు. అందుకే రామ రాజ్యం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement