Monday, December 23, 2024

TG: న‌ష్ట‌పోయిన మ‌త్స్యకారుల‌ను ఆదుకుంటాం… మంత్రి పొంగులేటి

వ‌ర‌ద వ‌ల్ల మ‌త్స్యకారుల‌కు తీవ్ర‌న‌ష్టం
ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం… పేద‌ల ప్ర‌భుత్వం
పేదోడి క‌ళ్ల‌లో ఆనందమే ధ్యేయం
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
కూసుమంచి పాలేరు జ‌లాశ‌యంలో చేప‌ల పిల్ల‌ల విడుద‌ల‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ఖ‌మ్మం : తుపాను, వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల మ‌త్స్య‌కారులు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని, వారిని ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం ఖ‌మ్మం జిల్లా కూసుమంచి పాలేరు జ‌లాశ‌యంలో చేప పిల్ల‌ల‌ను ఆయ‌న విడుద‌ల చేశారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌లు కోరి తెచ్చుకున్నార‌ని, అన్నివ‌ర్గాల సంక్షేమ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌న్నారు. ఇది పేద‌ల ప్ర‌భుత్వామ‌ని, పేదోడి క‌ళ్ల‌లో ఆనందం చూడ‌ట‌మే ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌న్నారు.

వ‌ర‌ద బాధిత‌ల‌కు ఇళ్లు మంజూరు…
వ‌ర‌ద‌ల వ‌ల్ల పేద‌లు ఇళ్లు కోల్పోయార‌ని, అలాంటి బాధితుల‌కు ఇళ్లు మంజూరు చేస్తామ‌ని మంత్రి పొంగులేటి అన్నారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం తాను అందుబాటులో ఉంటానని చెప్పారు.

- Advertisement -

వంద శాతం స‌బ్సిడీపై చేప‌ల పిల్ల‌ల విడుద‌ల‌…
రాష్ట వ్యాప్తంగా కులవృత్తిదారుల‌ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో 100శాతం సబ్సిడీతో ఉచిత చేప పిల్లలను విడుదల చేస్తున్నామ‌ని పొంగులేటి అన్నారు. ప్ర‌జ‌లు ఏ విశ్వాసంతో అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారమిచ్చారో అదే విశ్వాసంతో ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ రఘురామ్ రెడ్డి, రాష్ట ఫిషరీష్ చైర్మన్ సాయి, ఐటీసీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement