ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల జాబితాలు..
అర్హులకే పథకాలను అందిస్తామన్న అధికారులు..
జైనథ్, జనవరి 22 (ఆంధ్రప్రభ) : జెంట్ మండల కేంద్రంలో రైతు వేదిక ఆవరణలో అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలను ఈనెల 26న అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసభలకు వెల్లువలా అర్జీలు వచ్చాయి. ఈనెల 26న రైతు భరోసా, భూమిలేని కూలీలకు ఆత్మీయ భరోసా, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు.
అర్హులను గుర్తించేందుకు బుధవారం నుండి పంచాయతీ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి, అర్హుల జాబితా గురించి నోడల్ అధికారులు చదివి వినిపించారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నిర్వహించిన గ్రామసభల్లో ఏ గ్రామంలో ఉండే గ్రామసభ ఆ గ్రామాల వారీగా దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అర్జీలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీఎస్ ఇంచార్జి భాస్కర్ నాయక్, ఎంపీడీవో రవీంద్రనాథ్, ఏవో పూజ, ట్రైని ఎస్సై మధుకృష్ణ, మార్కెట్ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, ఏఈవో రాజు, దేవాదాయశాఖ చైర్మన్ అడ్డి లోకేష్ రెడ్డి, తదితర నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.