Friday, September 6, 2024

Kishan Reddy | ‘ఆత్మనిర్భర భారత్’ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్

కేంద్ర బడ్జెట్ సమతూకంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి…. మధ్య, ఎగువ మధ్య తరగతి వారికి పన్ను ఆదా ప్రకటించిందని తెలిపారు. వీధి వ్యాపారుల నుంచి మొదలు రైతులు, పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా బడ్జెట్ ఉంద‌ని అన్నారు. ఆత్మనిర్భర భారత్​ నిర్మాణమే లక్ష్యంగా కేంద్రం బడ్జెట్​ ప్రవేశ పెట్టిందని చెప్పుకొచ్చారు.

కోటిమంది పట్టణ పేద, మధ్యతరగతి కుటుంబాల గృహ అవసరాలను తీర్చడానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడిని కేంద్రం బడ్జెట్​లో ప్రతిపాదించిందని….. 4 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించడమే కేంద్రం లక్ష్యం పెట్టుకుంద‌ని కిషన్ రెడ్డి తెలిపారు. ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’​లో భాగంగా పేదలను శక్తివంతం చేయడం, అన్నదాత ఉత్పాదక సామర్థ్యాలను పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని కిషన్​ రెడ్డి వ్యాఖ్యానించారు.

వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.5 లక్షల కోట్లు బడ్జెట్​లో పెట్టామని…. మహిళలు, బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.3 లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు నరేంద్ర మోడీ సర్కారు చేసిందన్నారు. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించేలా పన్ను స్లాబ్‌లను మార్చిందని… పెరిగిన స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా 4 కోట్ల మందికి మేలు జరగనుందని కిషన్ రెడ్డి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement