Saturday, November 23, 2024

40 ఏళ్ల గరిష్టానికి యూకే ద్రవ్యోల్బణం.. పెరిగిన ఆహార, ఇంధన ధరలు..

న్యూఢిల్లి : ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ద్రవ్యోల్బణాలు గరిష్టాలను అందుకుంటున్నాయి. తాజాగా యూకేలో నమోదైన ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్టాన్ని టచ్‌ చేసింది. ఏప్రిల్‌కు సంబంధించిన ద్రవ్యోల్బణం 9శాతంగా నమోదైంది. ఆహార ఉత్పత్తుల ధరలతో పాటు ఇంధన ధరలు భారీగా పెరగడంతోనే.. రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం నమైదనట్టు అక్కడి ఆర్ధిక రంగ నిపుణులు చెబుతున్నారు. లండన్‌లో లివింగ్‌ ఆఫ్‌ కాస్ట్‌ భారీగా పెరిగింది. కన్జ్యూమర్‌ ధరలు ప్రతీ నెల 2.50 శాతం పెరుగుతూ వచ్చింది. ఆర్థికవేత్తల రాయిటర్స్‌ పోల్స్‌లో 2.60 శాతం పెరుగుదల అంచనాల కంటే తక్కువగా నమోదైంది. ఇది 9.1 శాతం వార్షిక పెరుగుదలను కూడా అంచనా వేసింది. 1989 తరువాత.. తొలిసారి ద్రవ్యోల్బణం 9 శాతం నమోదైంది. 1992లో మార్చిలో 8.4 శాతమే అత్యధికం. ఈ ఏడాది మార్చిలో 7 శాతంగా రికార్డయ్యింది. 1982లో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదైందని నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి యూకే ఎనర్జీ రెగ్యులేటర్‌ గ్లోబల్‌.. గ్యాస్‌ ధరలను రికార్డు స్థాయిలో పెంచేసింది. టోకు ఇంధన ధరలు కూడా భారీగా పెరిగాయి. అదేవిధంగా గృహ ఇంధన ధరల పరిమితిని 54 శాతం పెంచేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement