Saturday, November 23, 2024

TG | ఏసీబీ వ‌ల‌లో ఇద్ద‌రు ‘ఆర్ఐ’లు

  • లంచం తీసుకుంటుండ‌గా ప‌ట్టివేత
  • కొన‌సాగుతున్న విచార‌ణ‌
  • ఇంత‌లో పారిపోయిన ఆర్ఐ శ్రీ‌ధ‌ర్


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, పెద్ద‌ప‌ల్లి : పెద్ద‌ప‌ల్లి జిల్లా అంత‌ర్గాం త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో ఏసీబీ అధికారులు మంగ‌ళ‌వారం దాడి చేశారు. ఇద్ద‌రు రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్లు (ఆర్ఐలు) లంచం తీసుకుంటుండ‌గా ప‌ట్టుకున్నారు. విచార‌ణ కొన‌సాగుతుండ‌గా నిందితుల్లో ఒక‌రైన శ్రీ‌ధ‌ర్ పారిపోయారు. మ‌రో నిందితుడు శ్రీ‌మాన్ ఏసీబీ అధికారుల అదుపులో ఉన్నారు.

కొన‌సాగుతున్న విచార‌ణ‌…
పెద్దపల్లి జిల్లా అంతర్గాం త‌హ‌సీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. ఆర్ఐలు శ్రీ‌మాన్‌, శ్రీ‌ధ‌ర్ ఒక వ్య‌క్తి నుంచి లంచం తీసుకుంటున్నారు. అదే స‌మ‌యంలో చుట్టూ ఉన్న ఏసీబీ అధికారులు వెంట‌నే ప‌ట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన రికార్డులను ప‌రిశీలిస్తుండ‌గా శ్రీ‌ధ‌ర్ ప‌రారీ అయ్యారు. అయితే త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో విచార‌ణ కొన‌సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement