టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి పార్లమెంటు సెషన్ మొత్తాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఉభయసభల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే, వీరి ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు బహిష్కరణకు టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు.
టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చి సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఒకట్రెండు రోజుల్లో తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. కాగా, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి టీఆర్ఎస్ ఎంపీలు… ధాన్యం కొనుగోలుపై నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి వచ్చే యాసంగి పంటను కొనాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం మొండిగా వ్యవహరిస్తోంది.