హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) భారతదేశంలో ఇన్నోవా హైక్రాస్ 1,00,000 హోల్‌సేల్ యూనిట్ల విక్రయ మైలురాయిని వేడుక జరుపుకుంది. విడుదల చేసిన రెండేళ్లలోనే ఈ మైలురాయి చేరుకోవటం, టొయోటా బ్రాండ్‌పై కస్టమర్ల నమ్మకాన్ని బలపరుస్తుంది.
అదే సమయంలో ఇన్నోవా హైక్రాస్ దాని అధునాతన సాంకేతికత, సాటిలేని సౌలభ్యం, అసాధారణమైన పనితీరు కోసం పెరుగుతున్న ప్రజాదరణను సూచిస్తుంది. ఈసందర్భంగా టొయోటా కిర్లోస్కర్ మోటర్ సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ….
ఇన్నోవా హైక్రాస్ 1,00,000 యూనిట్ల మైలురాయిని సాధించినందుకు తాము సంతోషిస్తున్నామన్నారు. తాము అసమానమైన చలనశీలత అనుభవాలను అందించడం కొనసాగిస్తున్నందున తమ కస్టమర్లు చూపుతున్న నమ్మకం, అందిస్తున్న మద్దతు కోసం హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇన్నోవా హైక్రాస్లోని హైబ్రిడ్ టెక్నాలజీ, దాని అసాధారణమైన పనితీరు, విశేషమైన మైలేజీతో కస్టమర్లను ఆకట్టుకుంటోందన్నారు. ఇది కుటుంబం విభిన్న అవసరాలకు అనుగుణంగా ఆచరణాత్మక ఎంపికగా నిలిచిందన్నారు.