Tuesday, November 26, 2024

Lunar Cruiser: చంద్రుడిపై దూసుకెళ్లనున్న టయోటా కారు!

చంద్రునిపై త్వ‌ర‌లోనే మ‌నిషి కాలుమోప‌బోతున్నారు. అంతేకాదు చంద్రుడిపై ప్రయాణించేందుకు ఓ కారు కూడా సిద్ధమైంది. 2040 నాటికి చంద్రుడిపై, ఆ తర్వాత అంగారకుడిపై ప్రజలు నివసించడమే లక్ష్యంగా జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రయోగాల్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కూడా చేతులు కలిపింది. జాబిల్లిపై ప్రయోగాల కోసం ఓ కారును సిద్ధం చేస్తోంది. దీనికి ‘లూనార్ క్రూయిజర్’ అని పేరు పెట్టారు.

రోదసిలో తనిఖీలు చేయడం, నిర్వహణ, పనులు చేసేందుకు ఈ లూనార్ క్రూయిజర్‌కు ఓ రోబోటిక్ చేతిని కూడా అమరుస్తున్నారు. గిటాయ్ జపాన్ అనే సంస్థ దీనిని అభివృద్ధి చేసింది. ఈ వాహ‌నం 2030 వ‌ర‌కు సిద్ధం అవుతుంద‌ని, 2040 వ‌ర‌కు మార్స్ మీద‌కు కూడా ఈ వాహ‌నాన్ని తీసుకెళ్ల‌వ‌చ్చ‌ని ట‌యోటా చెబుతున్నది. స్పేస్ టెక్నాలజీలో వ‌స్తున్న మార్పుల‌కు అనుగుణంగా తాము కూడా వాహ‌నాల‌ను త‌యారు చేస్తున్నామ‌ని ట‌యోటా తెలియ‌జేసింది. భూమిపై మాదిరిగానే చంద్రునిపై కూడా ట‌యోటా వాహ‌నాలు త‌ప్ప‌కుండా సేవ‌లు అందిస్తాయ‌ని కంపెనీ వ‌ర్గాలు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement