నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ విషయానికి వస్తే బంగారం ధరలు మళ్లీ పతనం అయ్యాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.160 మేర తగ్గింది. క్రితం రోజు ఈ విలువ రూ.47 వేల 10 వద్ద ఉండగా.. ప్రస్తుతం రూ.46 వేల 850కి పడిపోయింది. ఇక ఇదే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.180 తగ్గింది. దీంతో తులం బంగారం రూ.51 వేల 110కి క్షీణించింది. బంగారం ధరలో గత కొద్దిరోజులుగా తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. బంగారానికి భారీగా డిమాండ్ ఉండే ధన్‌తేరాస్ వేళ మాత్రమే ఇటీవల కాలంలో గరిష్టంగా రూ.750 మేర పెరిగింది. అంతకుముందు మాత్రం రేట్లు వరుసగా పడిపోతూ వచ్చాయి.
ఇప్పుడు కూడా మళ్లీ అదే ధోరణి కనిపిస్తోంది. రానున్న రోజుల్లోనూ మరింత తగ్గే అవకాశాలే కనిపిస్తున్నాయి. MCX గోల్డ్ ఫ్యూచర్స్ కూడా క్షీణించాయి. బంగారంతో పోలిస్తే సిల్వర్ ట్రెండ్ వేరేలా ఉంది. ఇది వరుసగా పెరుగుతూ వెళ్తోంది. వరుసగా 5 సెషన్లలో రేటు ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు మరో రూ.300 పెరిగింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.63,500గా ఉంది. అక్టోబర్ 22న అత్యధికంగా రూ.1700 పెరిగింది. అంతకుముందు వారం- 10 రోజుల వ్యవధిలో ఏకంగా రూ.6500 మేర రేటు తగ్గింది. ఈ ధరలు ఆయా ప్రాంతాలను, పరిస్థితులను బట్టి మారుతుంటాయి.