Saturday, November 23, 2024

భక్తి తత్త్వానికి కిరీటి… మీరాబాయి

ఈకలియుగంలో మానవుల జన్మ సార్థకతకు తొమ్మిది భక్తి మార్గాలు భాగవతంలో విశ దీకరించారు. సర్వసాధారణంగా భగవంతుని గూర్చి శ్రవణం (పరమాత్మ లీలలు వినడం) ద్వారా మొదలై కీర్తనం, స్మరణం ద్వారా ఆఖరికి భక్తిలో ”ఆత్మనివేదన” ద్వా రా ముక్తి పొందుతారు. అటువంటి కోవకే చెందిన భక్తురాలు మీరాబాయి ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణ మి రోజు జన్మించింది. నేడు ఆమె జయంతి సందర్భంగా ఆమె భక్తి తత్త్వాన్ని స్మరించుకుందాం.
భారతదేశంలో జన్మించిన అనేకమంది యోగులు, కబీర్‌దాసు, సూరదాసు, తులసీదా సు, మీరాబాయి, సక్కుబాయి వంటి భక్తులు ఎంతోమంది మనకు ఆదర్శమై నిలిచారు. అది ”కుర్భి సంస్థానం. అంత:పురంలో ఆడుకుంటూ ఐదు సంవత్సరాలు వయస్సు బాలిక వీధిలో వెడుతున్న పెళ్లి ఊరేగింపు చూసి, పరుగున వెళ్ళి, అమ్మతో ”ఊరేగింపు” ఏమిటని అడిగి తెలు సుకొంది. తల్లి చెప్పినది విన్న మీరాబాయి ”పెళ్ళి అంటే ఏమిటి? చెప్పమ్మా!” అని మారాం చేసింది. తల్లికి ఏమి జవాబు చెప్పాలో తోచక, పల్లకీలో ఊరేగుతున్న మగవాడు- ఆ అమ్మాయి కలిసి భార్యాభర్తలుగా జీవిస్తారు. అదొక పెద్ద తంతు. ఇప్పుడు అర్థంకాదులే.” అనగానే నాకు ఎప్పుడు వివాహం చేస్తారు? అని అడిగేసరికి, తల్లి శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని తీసుకొచ్చి, ”ఇతడే నీ భర్త” అని చెప్పి ఇచ్చింది. విశాల నేత్రాలతో, పీతాంబర ధారి అయి ఉన్న శ్రీకృష్ణుడుని రోజూ ఆరాధించడం, నోటికి వచ్చిన భజనలు చేస్తూ, తొలినాటి నుండి మీరా దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ దివ్య చరణాలకు అంకితమై పోయింది. కుర్భి ఆస్థానం క్రమేపీ కుడ్కిగా రూపాం తరం చెందింది.
మీరాబాయి జశోదారావ్‌ రతన్‌ సింగ్‌ రాథోడ్‌, అ#హల్యాబాయి దంపతులకు 1498 సం. లో జన్మించింది. ఆమె రాజవంశంలో జన్మించిన కారణంగా, చదువు చెప్పడానికి గురువులు ఇంటికే వచ్చేవారు. ఆమెకు చదువు పట్ల అంత ఆసక్తి లేదు. నిరంతరం శ్రీ కృష్ణుడు భక్తిలో తన్మ యమయ్యేది. ఆమెకు యుక్త వయస్సు రాగానే, వివాహం చేద్దామని తల్లిదండ్రులు ఎంత ప్రయ త్నించినా, ఎవరితోనూ వివాహానికి అంగీకరించకపోగా, ”నువ్వే కదా! అమ్మా! ఆ దేవాది దేవు డైన శ్రీకృష్ణ పరమాత్మ నా భర్త అని. ఆయనే రక్షకుడు.” అంటూ తిరస్కరించేది.
ఆఖరికి ఆమెకు ఇష్టం లేకపోయినా, బలవంతంగా మేవార్‌ రాజు రాణాసింగ్‌ కుమారుడు యువరాజు భోజరింగ్‌ సిసోడియాకు ఇచ్చి 1516లో వివాహం జరిగింది. అత్తింటికి వెళ్ళినా కృష్ణుడు ఆరాధనలో మునిగిపోయేది. ఇది నచ్చని అత్తగారు నానాహంసలు పెట్టారు. ఒకసారి ఆమెను కృష్ణుడు రక్షించాడు. పూజకు పువ్వులను నిమిత్తం ఒక బుట్టలో కోడెత్రాచును పెట్టి, ఆమెకు ఇచ్చి, ”ఈ పూలతో కృష్ణుడుని అలంకరించమ్మా!” అన్నారు.
అసలు దురుద్దేశం పాము కాటుకు బలై మరణిస్తుందని. మీరా అత్తగారు ఇచ్చిన పెట్టె తెర వగా, పాముకు బదులుగా పూలు, పూలదండలు కనపడ్డాయి. వివాహం అయిన తదుపరి, భర్త భోజరాజసింగ్‌ సిసోడియా ఢిల్లి సుల్తానులతో పోరాడిన సందర్భంలో గాయపడి, తేరుకోలేక మరణించాడు. దాంతో అత్తింటివారి ఆగడాలు ఎక్కువయ్యాయి. ఒకసారి విహార యాత్రకు తీసుకుని వెళ్ళి, ఒక నదిలో తోసేసారు. మరణిస్తుందనుకొన్న అత్తమామలకు మీరా ఆ నీటిపై కూర్చుని కృష్ణ ధ్యానంలో కనపడింది. తరువాత మళ్ళీ ఆమెకు పాలల్లో విషం కలిపి ఇస్తే, మీరా బాయి ఆ విషయం తెలీక త్రాగేసింది. ఆమెకు ఏమీ కాలేదు కానీ… ఆమె నిత్యం ఆరాధించే కృష్ణు డు విగ్రహం రంగు మారిపోయింది.
అత్తగారు కృష్ణుడుని కాదు, దుర్గాదేవి, చాముండేశ్వరి, పార్వతీదేవిలను ఆరాధించాలని ఒత్తిడి చేసినా, ఫలితం ఏమీ లేదు. ఆమె స్వయంగా కీర్తనలు రచించి, గానం చేసేది. ఆ తరువాత ఈ విషయం తాన్సేన్‌ అనే భక్తుడుకు తెలిసి ఆమెను దర్శించాడు. తాన్సేను తరువాత అక్బర్‌ కొలువులో చేరినప్పుడు, ఆమెతో అక్బర్‌కు సమావేశం ఏర్పాటు చేయించాడు. ఆమె గానానికి, భక్తికి ముగ్ధుడై, ముత్యాల హారం బహూకరించారు. ఇక నాలుగు గోడల మధ్య ఇమడలేక, బృం దావనం, ద్వారక మధుర వంటి కృష్ణ ప్రదేశాలు సంచరిస్తూ, ఎన్నో కీర్తనలను అందించింది. ఆమె చివరికి కీర్తనను ఆలపిస్తూ, ద్వారకలోని కృష్ణుడు ప్రతిమలో లీనమైపోయింది. ముం దుగా ఆలయం అధికారుల వద్ద నుండి, ఆ రాత్రికి గర్భగుడిలో ఉండి ధ్యానం చేసుకోవడానికి అనుమతి తీసుకొంది. తెల్లారిన తదుపరి పూజారులు తలుపులు తెరవగా ఆమె కనపడలేదు. ఆమె కృష్ణుడులో ఐక్యమైనట్లు కొన్ని చిహ్నాలు కనపడ్డాయి.
మీరా అనేక కీర్తనలు అలవోకగా ఆశువగా పాడింది. వాటిలో ఇప్పటికీ ప్రచారంలో ఉన్నవి —” పాయో జీ మైనే రామ్‌ రామన్‌ ధన్‌ పాయో” – అంటే నాకు భగవానుని నామ ఆశీర్వచనం గొప్పది. ఇవ్వబడింది” అని.
ఆమె కీర్తనలలో ఈ సంసారంలో కొట్టుకొంటూ, మనశ్శాంతి లేని జీవితం ఎందుకు? కృష్ణ పరమాత్మ పాదాలను ఆశ్రయించండి. అని బోధించింది. భారతదేశ ప్రభుత్వం వారు 1952 లో మీరాబాయి ఫొటోతో రెండు అణాల స్టాంపు విడుదల చేశారు.
రాజస్థాన్‌లోని చిత్తోర్గఢ్‌ జిల్లాలో ”మీరా స్మృతి సంస్థాన్‌ ట్రస్టు” యోగి రాయ్‌ దాస్‌ అనే ఆయన ఏర్పాటు చేశారు. అక్కడ ఇప్పటికీ, మహోత్తర ఉత్సవాలు నిర్వహస్తారు. అంతేకాక ఆమె కీర్తనలను ప్రచారం చేస్తున్నారు. గత జన్మలో మీరా బృందావనంలోని ఒక గోపిక అని, రాధకు స్నేహతురాలు అని ఇప్పటికీ విశ్వసిస్తారు. ఇంతటి మహోన్నతమైన కృష్ణ భక్తురాలు, యోగిని, మీరాబాయిని ఆమె జయంతి రోజున తలుచుకోవడం మనం ఆమెకు ఇచ్చే నివాళి.

Advertisement

తాజా వార్తలు

Advertisement