తాము చేస్తున్న కృషికి ఈ అవార్డు ఒక గుర్తింపు అని, ఇది తమకు ఎంతో ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తోందని వాటర్ బేస్ లిమిటెడ్ సీఈఓ రమాకాంత్ ఆకుల అన్నారు. విజయవంతమైన రొయ్యల సాగుకి ఉత్తమ నాణ్యతతోకూడిన ఉత్పత్తులు, సేవలు అందించడం పై దృష్టిపెట్టి, భారతదేశపు ష్రింప్ అక్వాకల్చర్ లో పురోగామి అయిన వాటర్బేస్ లిమిటెడ్ కి, అగ్రి-ఫుడ్ ఎంపవరింగ్ ఇండియా అవార్డ్స్ 2021 లో ఫుడ్ ప్రోడక్ట్స్ విభాగంలో అవార్డు లభించింది.
ఈ అవార్డు పొందిన సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రమాకాంత్ ఆకుల మాట్లాడుతూ… 28 ఏళ్ళ నిబద్ధ ప్రయాణంలో, భరణీయమైన, నాణ్యతా ఉత్పత్తుల్ని అందించడం మీదే ప్రధానంగా దృష్టిపెట్టామన్నారు. ఇందుకోసం, తమ కార్యకలాపాలన్నీ పర్యావరణాన్ని రక్షించడం, సామాజికంగా బాధ్యతగా వ్యవహరించడం, రొయ్యలు ఆరోగ్యంగా, తినడానికి వీలైనట్టుగా వుండేలా చూడ్డానికి ఉత్తమ మేత విత్తులు, సాగు రక్షక ఉత్పత్తులని అందించే దిశలోనే నిర్వహిస్తున్నామన్నారు. అగ్రి-ఫుడ్ ఎంపవరింగ్ ఇండియా అవార్డ్స్ 2021 లో ఫుడ్ ఫ్రోడక్ట్స్ విభాగంలో అవార్డు పొందడం అన్నది ఖచ్చితంగా తమ వాటర్ బేస్ లిమిటెడ్ కీర్తికిరీటంలో కలికితురాయేనని, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని గుర్తింపులు సాధించగలమని ఆశిస్తున్నానని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
AndhraPrabha #AndhraPrabhaDigital