Saturday, December 21, 2024

TG | రెరా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌కు సిబ్బంది..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రియల్‌ ఎస్టేట్‌ నియంత్రణ సంస్థ (రెరా) ప్రాజెక్టుల విషయంలో తీసుకునే నిర్ణయాలను సవాల్‌ చేసేందుకు అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌కు 33 మంది సిబ్బందిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినా కొంత కాలంగా సిబ్బందిని నియమించలేదు.

రెరా ట్రిబ్యునల్‌ పని ప్రారంభించేలా సిబ్బందిని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈనేపథ్యంలో మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అప్పిలేట్‌కు వచ్చిన కేసులను దశలవారీగా విచారణ చేపట్టి పరిష్కరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement