తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు భద్రత పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 20 మంది పోలీసులతో శ్రీనివాస్‌గౌడ్‌కు భద్రత పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరుగురు ఇంటెలిజెన్స్, 10 మంది సిటీ సెక్యూరిటీ వింగ్‌తో భద్రత కల్పిస్తారు. నలుగురు గ్రేహౌండ్స్ పోలీసులతో శ్రీనివాస్‌గౌడ్‌కు భద్రత కల్పించనున్నారు. సీఎం కేసీఆర్ తర్వాత శ్రీనివాస్‌గౌడ్‌కు గ్రేహౌండ్స్‌తో భద్రత కల్పిస్తున్నారు. ఎం44 వెపన్స్‌తో గ్రేహౌండ్స్ పోలీసులు శ్రీనివాస్‌గౌడ్‌కు భద్రత కల్పించనున్నారు. శ్రీనివాస్‌గౌడ్ కాన్వాయ్‌లో మరో రెండు వాహనాలు పెంచారు.
కాగా, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. మహబూబ్‌నగర్‌కు చెందిన మార్కెట్ చైర్మన్ అమరేందర్ రాజు, ఆయన సోదరులు రాఘవేంద్రరాజు, మధుసూదన్‌రాజు, నాగరాజు, మున్నూర్ రవి కలిసి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణ వెల్లడైంది. నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ విషయంలో బీజేపీ కీలక నేతలు జితేందర్ రెడ్డి, డీకే అరుణలపై కూడా ఆరోపణలు వచ్చాయి.