కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనను సుమోటాగా స్వీకరించిన సుప్రీకోర్టు ఈరోజు మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వం.. వైద్యుల భద్రతకు తీసుకున్న చర్యల గురించి అఫిడ్‌విట్ సమర్పించింది. ఈ సందర్భంగా కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళనలు తెలుపుతున్న వైద్యులను మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా విధులకు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
వైద్యులు విధుల్లో చేరేందుకు బెంగాల్ ప్రభుత్వం విధించిన గడువు సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గడువును పొడిగింది. మంగళవారం సాయంత్రంలోపు విధులకు హాజరుకావాలని. లేకుంటే క్రమశిక్షాణ చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.