Tuesday, November 26, 2024

తెలంగాణ కోడలికి పెరుగుతున్న మద్దతు

భైంసాలో నాలుగేళ్ల బాలిక‌పై జరిగిన అత్యాచారయ‌త్నాన్ని ష‌ర్మిల ఖండించారు. ఉమ్మ‌డి న‌‌ల్ల‌గొండ జిల్లా ఎక్స్ ఎంపీటీసీల ఫోరం అధ్య‌క్షుడు మిట్ట పురుషోత్తం రెడ్డి ష‌ర్మిల‌కు త‌న మ‌ద్ద‌తు తెలిపారు.సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీకి చెందిన ఓబీసీ విద్యార్థి సంఘం నాయకుడు కిర‌ణ్ ఆధ్వ‌ర్యంలో 15 మంది విద్యార్థులు ష‌ర్మిలకు త‌మ బాధ‌ను వివ‌రించుకున్నారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న‌ప్పుడు పూర్తి రీయింబ‌ర్స్‌మెంట్‌ను అందించేవారని ప్ర‌స్తుతం 10,000 వేల ర్యాంకు లోపు వచ్చిన విద్యార్థుల‌కు మాత్ర‌మే పూర్తి రీయింబ‌ర్స్‌మెంట్ అందిస్తున్నార‌ని త‌మ గోడును విన్న‌వించుకున్నారు.

అయితే తాము అధికారంలోకి వ‌చ్చాక పూర్తి రీయింబ‌ర్స్‌మెంట్ అందిస్తామ‌ని భ‌రోసానిచ్చారు.మెద‌క్ జిల్లా ఆందోళ్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు సంజీవ‌రావు ఆధ్వ‌ర్యంలో 200 మందికి పైగా నాయ‌కులు లోటస్ పాండ్‌కు వ‌చ్చి త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తు తెలిపారు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన నాయ‌కుల‌తో గురువారం ఉద‌యం 11 గంట‌ల‌కు ఆత్మీయ స‌మ్మేళ‌నం నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement