Tuesday, November 26, 2024

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు ఊగిసలాటధోరణిలోనే పయణించాయి. రూపాయి బలహీనత, చమురు ధరలు పెరుగుతుండటం మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 287 పాయింట్లు నష్టపోయి 59,543కి పడిపోయింది. నిఫ్టీ 74 పాయింట్లు కోల్పోయి 17,656కి దిగజారింది. టెక్ మహీంద్రా (3.29%), మారుతి (2.72%), ఎల్ అండ్ టీ (1.98%), డాక్టర్ రెడ్డీస్ (1.52%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.37%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.  నెస్లే ఇండియా (-2.83%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.71%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.55%), కొటక్ బ్యాంక్ (-2.52%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.59%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement