Sunday, December 8, 2024

Stampede – సంధ్య థియేటర్ పై కేసు నమోదు

హైదరాబాద్ – పుష్ప 2 విడుదల సందర్భంగా. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీరియస్ అయ్యారు హైదరాబాద్ పోలీసులు. బెనిఫిట్ షో సందర్భంగా వచ్చే క్రౌడ్ ని దృష్టిలో ఉంచుకొని సరైన భద్రత చర్యలు పాటించకపోవడం పై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిన్నటి తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన ఘటన నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యం పై కేసు నమోదు చేశారు.

దిల్‌షుక్‌ నగర్‌కు చెందిన రేవత్-భాస్కర్‌ దంపతులు పిల్లలు శ్రీతేజ్, సన్వీకలతో కలిసి పుష్ప ప్రీమియర్ చూసేందుకు సంధ్య 70ఎంఎం ధియేటర్‌కు వచ్చారు. అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో అభిమానులు గేటు లోపలకు చొచ్చుకు వచ్చారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి , ఆమె కొడుకు శ్రీ తేజ లు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు విద్యా నగర్ లోని దుర్గా భాయి దేశముఖ్ హాస్పిటల్‌కు తరలించారు.రేవతి అప్పటికే మృతి చెందగా , శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ నుంచి గాంధీ మార్చురీకి తరలించారు.

- Advertisement -

మరోవైపు సినీ హీరో అల్లు అర్జున్ వచ్చే సమయం పై పోలీసులకు సరైన క్లారిటీ ఇవ్వకపోవడం పై నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు. షోకు వచ్చే పబ్లిక్ మాత్రమే కాకుండా హీరో అల్లు అర్జున్ ని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం ఎగబడతారని తెలిసి నిర్లక్ష్యం వహించడంపై పోలీసులు సీరియస్ అయ్యారు.

సినీ హీరోతో జరిపే ఈవెంట్ పై ముందస్తు ఎలాంటి సమాచారం లేకుండానే కార్యక్రమం నిర్వహించడం పై పోలీసులు సీరియస్ అయ్యారు. ఒక సినీ హీరో వచ్చే సమయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు తీయటం నిర్వాహకులు తీసుకోలేదని మండిపడ్డారు హైదరాబాద్ పోలీసులు.

థియేటర్ యాజమాన్య నిర్లక్ష్య ఘటన తోటే మహిళతో మృతి చెందిందని భవిష్యత్తులో థియేటర్ నిర్వాహకులకు బెనిఫిట్ షో లేదా ఈవెంట్స్ పై ఖచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపారు పోలీసులు. నిబంధనలు ఉల్లంఘించి కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.సినిమాలు మరియు వినోదం

Advertisement

తాజా వార్తలు

Advertisement