Saturday, November 23, 2024

హంసవాహనాలపైవిహరించనున్న శ్రీవారు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు అయి న నేటి ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఐదు తలల చిన్నశేష వా#హనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశే షుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేష భూతం. శేష వా#హనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వా#హనా న్ని దర్శిస్తే భక్తులకు కుం డలినీ యోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

#హంస వా#హనం (రాత్రి 7గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నేటి రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు వీణాపాణియై #హంసవా #హనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమిస్తారు. బ్ర#హ్మ వా#హనమైన #హంస పరమ#హంస కు ప్రతీక. #హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరు చేయగలదు. అంటే మంచిని, చెడును గ్ర#హంచగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు #హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు #హంస వా#హనాన్ని అధిరో#హంచి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అ#హంభావాన్ని తొలగించి దాసో#హ భావాన్ని (శరణాగతి) కలిగిస్తాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement