Tuesday, November 26, 2024

రికార్డ్ స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం..భ‌క్తుల‌కు టిటిడి నిబంధ‌న‌లు..

శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. తిరుమలకు వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్న సర్టిఫికెట్‌ లేదా, మూడురోజుల ముందు కరోనా పరీక్ష చేసుకున్న నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాలని సూచించింది. మొదటి డోసు పూర్తయిన వారు కూడా దర్శనానికి రావొచ్చు.. భక్తుల సంఖ్యను పెంచడంతో భక్తుల ఆరోగ్య పరిరక్షణకు నూతన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

కాగా తిరుమల శ్రీవారికి ఆలయానికి కళ్లు చెదిరేలా హుండీ ఆదాయం సమకూరుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటూ సర్వదర్శనం టోకెన్లు జారీతో భక్తుల సంఖ్య పెరిగింది. అక్టోబర్ నెలలో శ్రీవారిని 8,12,818 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 3,77.970 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక స్వామివారి హుండీ ఆదాయం రూ.79 కోట్ల 10 లక్షల లభించింది. అక్టోబర్ మాసంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య తగ్గినా.. శ్రీవారి హుండీ ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగింది.

టీటీడీ దర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లోనే విడుదల చేస్తోంది. శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లను ‘గోవింద’ యాప్‌లో కాకుండా టీటీడీ వెబ్‌సైట్‌లోనే బుక్‌ చేసుకోవాలి. అంతేకాదు నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన టోకెన్ల సంఖ్యను కూడా పెంచింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు.. రోజుకు 12వేల చొప్పున.. సర్వదర్శన 10వేల చొప్పున విడుదల చేశారు. అలాగే అద్దె గదుల్ని కూడా విడుదలయ్యాయి. కాగా నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.79కోట్లుగా వ‌చ్చింది.. 28వేల 311మంది భ‌క్తులు శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. 12వేల 835మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement