Sunday, January 12, 2025

Srisailam | మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీశైలం మల్లన్న మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహోత్సవాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి సెలవుల సందర్భంగా మల్లన్న మహాక్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్షేత్ర వీధులన్నీ కిక్కిరిసిపోయాయి.

కాగా, ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు పసుపు, కుంకుమ, పూలు, పండ్లతో సంప్రదాయబద్ధంగా ముఖద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించారు. అనంతరం లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement