Friday, November 22, 2024

సియాచిన్ లో శివంగి…

న్యూఢిల్లి : ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ కార్ప్స్‌ కెప్టెన్‌ శివచౌహాన్‌ ఇండియన్‌ ఆర్మీలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమి సియాచి న్‌లో మోహరించిన తొలి మహిళ అధికారిగా గుర్తింపు పొందారు. మంచు శిఖరంపై ఆమె శివంగిలా దూసుకెళ్లింది. విధి నిర్వహణలో ఆమె అనితర సాధ్యమైన ధైర్య సాహసాల ను, ధృడత్వాన్ని ప్రదర్శిస్తున్నది. జమ్ము-కాశ్మీర్‌లోని సియాచిన్‌ యుద్ధక్షేత్రంలో శివచౌహాన్‌ సాహస కృత్యాల వీడియోను ఇండియన్‌ ఆర్మీ విడుదల చేసింది. రాజస్థాన్‌లొ ని ఉదయపూర్‌ నివాసి అయిన కెప్టెన్‌ శివచౌహాన్‌ గత జనవరిలో సియాచిన్‌ గ్లేసియర్‌పై కాలుమోపింది. దాంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమిలో అడుగుపెట్టిన మొదటి మహళా సైనికురాలిగా రికార్డు సృష్టించింది.

నెల రోజుల కఠినమైన శిక్షణ తర్వాత కెప్టెన్‌ శివ చౌహాన్‌ను సియాచిన్‌ గ్లేసియర్‌లోని కుమార్‌ పోస్ట్‌లో నియమించారు. కుమార్‌ పోస్ట్‌ సముద్ర మట్టానికి 15,600 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడ ఏడాదిలో 12 నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది. కాగా, 11 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన శివ చౌహాన్‌ తల్లి దగ్గరే పెరిగింది. ఉదయపూర్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత శివ ఇంజ నీరింగ్‌ డిగ్రీ పూర్తిచేసింది. చిన్నప్పటి నుంచి ఆర్మీ యూని ఫాం ధరించాలని కలలు కన్న ఆమె ఆర్మీ సీడీఎస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 2021లో కార్ప్స్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌లో చేరింది.భారతదేశ నారీ శక్తి స్ఫూర్తికి నిదర్శనం అంటూ జనవరి 3 న ప్రధాని మోడీ ఆమె సాహసకృత్యాలను ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement