Monday, December 30, 2024

Tiruchanur | పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సింధు దంపతులు

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇటీవలే సింధు వివాహం హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయితో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత కొత్త దపంతులు అమ్మవారి ఆశీస్సుల కోసం తిరుమతి వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి సింధు-దత్త సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని.. పెళ్లి తర్వాత అమ్మ ఆశీస్సుల కోసం వచ్చినట్లు సింధు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement