Monday, November 18, 2024

శిలాతపస్విని…అహల్య!

బ్రహ్మ మానస పుత్రికయై, మహర్షి, మంత్రద్రష్ట, న్యాయసూత్ర ప్రణత, అక్ష పాదుడు అయిన గౌతమ మహర్షిని పరిణయమాడి పంచకన్యలలో ప్రథమ తాంబూలం అందుకుంటున్న పతివ్రతా శిరోమణి అహల్య.

హలం నామేకహా వైరూప్యం హల్యం తత్ప్రభవం భవేత్‌!

యస్యాన విద్యతే హల్యం తేనాహల్యేతి విశ్రుతా!! (వా.ఉ. 30.29)
హల్యమనగా వైరూప్యం. అది లేనిది అహల్య. సర్వాంగ సుందరిగా సష్టికర్త చేతనే ప్రశంసించబడిన సౌందర్యం అహల్యది. వేదవాఙ్మయం నుండి దక్షిణాంధ్ర సాహత్యం మీదుగా ఆధునిక సాహత్యం వరకు అహల్య అనేక రూపాల్లో మనకు దర్శనమిస్తోంది. వికారమైన రూపాన్ని హలం అంటారు. హలం నుంచి పుట్టిందే హల్యం. అహల్య అంటే అత్యంత సౌందర్యవతి అని అర్థం. ఎలాంటి వంకరలేని స్త్రీ అని అర్థం. అహల్య ఉదంతం మనకు రామాయణంలో బాలకాండలో కనిపిస్తుంది.
బ్రహ్మ తన తపస్సును వెచ్చించి అత్యంత సౌందర్యవతి అయిన స్త్రీమూర్తిని సృష్టిం చాడు. ఆవిడే అహల్య. తన సౌందర్యాన్ని చూసి మోహంచిన దేవతలు అహల్యను భార్యగా పొందాలని భావించారు. అయితే, ఎవరైతే ముందుగా భూప్రదక్షిణ చేసి వస్తా రో వారికే అహల్యనిచ్చి వివాహం చేస్తానన్నాడు బ్రహ్మ. దేవతలంతా భూప్రదక్షిణకు బయల్దేరుతారు. నారదుని ప్రోత్సాహంతో గౌతమ మహర్షి తన తపశ్శక్తితో అప్పుడే ప్రస విస్తున్న గోవును సృష్టించి, దానిచుట్టూ ప్రదక్షిణ చేశాడట. అలా భూప్రదక్షిణ చేసిన పుణ్యం పొందడంతో అహల్యను గౌతమునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు బ్రహ్మ.
వాల్మీకి రామాయణంలో గౌతముని రూపంలో వచ్చిన ఇంద్రుడిని అహల్య గుర్తి స్తుంది. ‘ఓ సురశ్రేష్ఠా! నా దాంపత్య జీవితంలో నేను సంతుష్టురాలనై ఉన్నాను. త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపో’ అంటూ మందలిస్తుంది అహల్య. ఇంద్రుడు కూడా ‘నీ పద్ధతికి ఆనందించాను. వెళ్లిపోతాన’ని బయటకువస్తాడు.
అదే సమయంలో గౌతముడు వచ్చి అహల్యను ”వేలాది సంవత్సరాలు నీవు అన్న పానాదులు లేకుండా వాయు భక్షణతో తపిస్తూ ఈ ఆశ్రమం నందే పడిఉంటావు. భస్మశాయినివై ఎవరికీ కనపడకుండా నీలో నీవు కుమిలిపోతూ ఉంటావు. దశరథ నందనుడైన శ్రీరాముడు ఇక్కడకు వచ్చినపుడు ఆయన పవిత్రమైన పాద ధూళి సోకినం తనే నీవు పవిత్రురాలివవుతావు. ఆయనకు అతిథి మర్యాదలు చేసిన తర్వాత తిరిగి నీవు నన్ను చేరుకుంటావు”. అని శపించి హమాలయాలకు వెళ్లిపోయాడు.
అయినా లోకంలో ఇంద్రునికి అహల్యా జారుడని పేరు ఉన్నది. అది పైపైన చెప్పు కొనే అర్థమే. ఇందులోని ఆంతర్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి.
లోకం అంటే తాత్వికంగా మనస్సు అని అర్థం. చంచలమైన మనస్సు, ఇంద్రియ లౌల్యం కారణంగా భోగ లాలసత వైపు ఆకర్షితమవుతుంది. మన మనస్సు ఎలా ఉం టుందో, మనకు లోకం కూడా అలా కనిపిస్తుంది. ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు. కాబట్టి, మనస్సును సకారాత్మకంగా నడిపించగలిగితే ఆంతర్యాన్ని అవగహన చేసు కోగలుగుతాం. ‘అహ: లీయతే అస్యాం ఇతి అహల్య’ అంటారు. అహస్సు అంటే పగలు. అది దేనిలో లీనమవుతుందో అది అహల్య. కాబట్టి, అహల్య అంటే రాత్రి అని అర్థం. ‘అహస్సు రాత్రిలో లీనమవడం’ జారత్వంగా చెబుతారు.
అహల్య కథ నిజానికి ప్రతీకాత్మకమైన గాథగా చెప్పుకోవాలి. ‘గో’ శబ్దానికి కిరణా లు అని అర్థముంది. సాధారణంగా పగలు కనిపించే కిరణాలు రాత్రిలో లీనమవుతాయి. ఇంద్రుడు అంటే సూర్యుడిని చెబుతుంది శబ్దరత్నాకరం. సూర్యోదయం కాగానే రాత్రి ఉనికిని కోల్పోతుంది. దీనినిబట్టి సూర్యోదయంతో అంటే ఇంద్రుడు రావడంతో అహ ల్య (రాత్రి) సూర్యునిలో (ఇంద్రునిలో) లయమైందని భావం. ఈ ప్రకారంగా అహల్యా జారుడు అనే భావన ఏర్పడింది. ఆ తరువాత శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో కలసి గౌత మ ముని ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. గుర్తుపట్టలేని రీతిలో ఉన్న అహల్య కనిపిస్తుంది. ఇక్కడ వాల్మీకి ఆమె వాయుభక్షణాది కఠోర దీక్షతో, తప: ప్రభావం వలన ఆమె కాంతిమ యంగా కనపడుతున్నట్లు వర్ణిస్తారు. చివరకు పొగ ఆవరించి ఎవరికీ కనిపించని రీతిలో ఉందంటాడు. శ్రీరాముని దర్శనమైనంతనే ఆమెకు శాపవిముక్తి కలిగిందంటాడు.
ప్రభు మేని గాలిపై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే!
ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్క దానికి చెవులు కలిగే!
ప్రభు మేని నెత్తావి పరిమళించిన తోనె యశ్మమొకటి ఘ్రాణంద్రియము చెందే!
ప్రభు నీలరత్న తోరణ మంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే…
”శ్రీరామచంద్రుడి శరీరం మీది గాలి సోకగనే ఒక రాయికి స్పర్శ కలిగిందట, ఆయన కాలి సవ్వడి విని చెవులు పనిచేయటం మొదలు పెట్టినవట! ఆయన శరీర సుగంధము వ్యాపించినంతనే ఒక రాయికి వాసనలు తెలుస్తున్నవట! నీలమేఘశ్యాముని రూపం కన వచ్చి రాతికి కన్నులు పనిచేయటం మొదలు పెట్టినవట. చివరిగా ఆ శిల అహల్య ఆకా రాన్ని సంతరించుకొన్నది! ఇంతలో గౌతమ మహర్షి వచ్చి చేరాడు వారిని. అహల్య పట్టరాని ఆనందంతో ప్రభువు రూపాన్ని చూస్తూ శిలలాగ నిలుచుని ఆనంద పారవశ్యం లో మునిగిపోయింది.” అంటూ విశ్వనాథ వారు తన కల్పవృక్షంలో వర్ణిస్తారు.
అప్పుడు రామలక్ష్మణులు ఆమె పాదాలకు నమస్కరిస్తారు. ఆమె తన భర్త చెప్పిన మాటలు గుర్తుతెచ్చుకుంటూ తిరిగి వీరి పాదాలకు నమస్కరిస్తుంది. అతిథి మర్యాదలు అయిన తర్వాత రామాగమనాన్ని గ్రహంచి గౌతముడు అక్కడికి చేరుకుని అహల్యా సమేతుడై శ్రీ రాముని సేవిస్తాడు. భర్త గౌతమ మహర్షి శాపంతో రాయిగా మారిన అహల్య, శ్రీరాముడి పాదస్పర్శతో తిరిగి స్త్రీ రూపం ధరించిందనే కథనాలు ఉన్నాయి.
అపార తపశ్శక్తి, మేధాశక్తితో ఇంద్ర పదవికి కావల్సిన సర్వవిజ్ఞానం గౌతముడు పొందాక, ఆయన్ని పరీక్షించడానికి ఇంద్రుడు ఓ పథకం వేశాడు. అతడు కామక్రోధ మదమాత్సర్యాలను జయించాడా? లేదా? అని తెలుసుకోడానికి గౌతమ మహర్షి రూపంలో అహల్య చెంతకు వస్తాడు. అలా వచ్చింది ఇంద్రుడేనని తన పాతివ్రత్య బలం తో అహల్య గ్రహంచింది. అయితే ఇంద్రుడంతటి వాడు తనను కావాలనుకోవడాన్ని గుర్తించి అహల్య క్షణకాలంపాటు విచలితురాలయింది. ఆమె మనసును చంచలం చెయ్యగలిగినందుకు దేవేంద్రుడు తనలో తాను నవ్వుకున్నాడు. అప్పుడు సత్యం బోధ పడిన మునిపత్ని ఇంద్రుణ్ణి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోమని వేడుకుంటుంది. కానీ, ఈలోగా అక్కడకు వచ్చిన గౌతముడు పొరబడి, ఆవేశంతో ఇద్దరినీ శపించాడు. అలా ఆయనకు ఇంద్ర పదవిని దేవేంద్రుడు దూరం చేశాడు. అలాగే, ఎండకు ఎండుతూ, వాన కు తడుస్తూ ఎవరికీ కనబడకుండా కేవలం గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వెయ్యేళ్లు జీవించాలని గౌతముడు ఆమెను శపించాడు. కానీ రాయివికమ్మని అనలేదు. జనబాహుళ్యంలో బలంగా చొచ్చుకుపోయి ఉన్న కథలలో చాలా వరకు ప్రక్షిప్తాలే.
అహల్య ఎంతో సాత్వికురాలు కాబట్టి… తన భర్త రూపంలో వచ్చిన ఇంద్రుడు సల్లాపాలు ఆడినప్పుడు కూడా తన భర్తేనని అనుకుని మురిసిపోయింది. అంతేకాని… ఆమెకు ఇతర పురుషుల మీద వ్యామోహం అనేది అస్సలు లేదు. తొందరపాటుతో భర్త శపించినప్పటికీ దానిని అంగీకరిస్తూ తన భర్త మాటను దాటేయకుండా శిరసావహం చింది. ఇదే అహల్య గొప్పతనం.
అహల్యాగౌతముల కుమారుడైన శతానందుడు జనకుడి ఆస్థాన పురోహతుడు. వీరి కుమార్తె అంజన, తల్లి. అహల్య పంచకన్యల్లో స్థానం సంపాదించు కోగలిగిందంటేనే ఆమె పవిత్రత ను మనం అర్థం చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement