Thursday, November 21, 2024

శంకరాచార్యుల మాతృమూర్తి ఋణం…

శ్రీ ఆది శంకరాచార్యుల వా రు సన్యాసాశ్రమం స్వీకరించి తన ఆప్తులందరినీ త్యజించి వెళ్ళేముందు తల్లి ఆర్యాంబ చాలా బాధపడింది.
”శంకరా, నువ్వు నాకు ఏకైక పుత్రుడువి కదా! నన్ను వదలి వెళ్ళిపోతున్నావు, ఆఖ రి క్షణాల్లో నాకని ఎవరున్నా రు? నాకు దిక్కెవరు” అని దీనంగా ప్రశ్నించింది.
”అమ్మా! ఏ సమయమై నా సరే, నీవు తల్చుకుంటే చా లు నీ ముందు వుంటాను.” అ న్నాడు శంకరుడు. భగవత్పా దులు శంకరాచార్యుల వా రి తల్లికి మరణ కాలం సమీ పించింది. మూసిన కళ్ళు తెర వలేదు. ”నేను తలచి న వెంట న వస్తానన్నాడే శంక రుడు” అని మనసులోనే తలుచుకుం టూ వున్నది ఆర్యాంబ. తల్లి తలచుకుంటున్నదన్న విష యం ఆదిశంకరులు గ్రహంచారు. వెంటనే శ్రీకృష్ణుని ధ్యానించారు.
శ్రీకృష్ణుడు ఏం కావాలని అడిగాడు. కురుపితామహుడు భీష్మాచార్యునికి మోక్షమిచ్చినట్లు గా నా మాతృమూర్తికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నారు శంకరాచార్యుల వారు. ఆర్యాంబ, తలుచుకుంటే శంకరుడు వస్తానన్నాడే అని తపిస్తున్నప్పుడు అక్కడికి ఎవరో వస్తున్న అలికిడ యింది. కళ్ళు కూడా తెరవలేని స్థితిలో వున్న ఆర్యాంబ చటుక్కున లేచి శంకరా అంటూ, అక్కడి కి వచ్చిన ఒక పసిబాలుని, గట్టిగా హృదయానికి హత్తుకుంది.
బాలుని ఒంటి నిండా ఆభరణాలను గమనించిన ఆర్యాంబ, శంకరుడు సన్యాసి కదా! యీ ఆభరణాలు ఎలావచ్చాయని అనుకున్నది. బరువెక్కిన కనురెప్పలను మెల్లిగా తెరచి చూసింది ఆర్యాంబ. అక్కడ తను అను నిత్యం పూజించే గురువాయూరు శ్రీకృష్ణుడు సాక్షాత్కరించి నిలచి వుండడం గమనించింది.
గురువాయూరప్పని చూసిన ఆర్యాంబ మహదానందంతో ”అప్పా! నోరు తెరిచి, నీ నామ జపం చేసే శక్తి కూడా లేని యీ దీనురాలి ఆఖరి క్షణాలలో నను చూసేందుకు వచ్చావా? కృష్ణా” అని మెల్లిగా గద్గ³ద కంఠంతో పలికింది.
శ్రీకృష్ణుడు వెంటనే ”నీ పుత్రుని ఆదేశం. రాకుండా వుండగలనా? అమ్మను చూడకుండా వుండగలనా” అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు. అదే సమయానికి శంకరాచార్యులవారు కూడా అక్కడికి వచ్చారు.
ఉప్పొంగిన ఆనందంతో ఆ మాతృమూర్తి శంకరునితో ”నాయనా! నా భాగ్యమేమని చెప్ప ను? నిన్ను పుత్రునిగా పొంది నేను తరించాను. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడినే నా ముందు నిలబె ట్టావు కదా శంకరా!” అని కన్నీళ్ళు కార్చింది.
గోపాలుని నేను నిలబెట్టడమేమిటి? నేను జన్మించినది మొదలు నీవు నా కోసం పడ్డ శ్రమ కు, కష్టాలకు బదులుగా నేనేమీ చేయలేకపోయాను. సాక్షాత్తు భగవంతుడే మానవరూపంలో పుట్టినా మాతృ ప్రేమకు సాటిగా, ఎంతటి సేవ చేసినా కన్నతల్లి ఋణం అణువంతైనా తీరదు.
నేనైనా అంతే. నేను చేయగలిగినదంతా నీ దివ్య చరణాలకు హృదయపూర్వకమైన సాష్టాం గ ప్రమాణం ఒక్కటే” అని మాతృదేవత పాదాల ముందు మోకరిల్లారు ఆదిశంకరాచార్యుల వారు. మన తల్లితండ్రులకు మనం చేసే సేవల వల్లనే వారి మనసు సంతృప్తిచెంది వారి దివ్యాశీ స్సులు సదా తమ బిడ్డలకు ప్రసాదిస్తారని జగద్గురు ఆదిశంకరాచార్యులవారు ఈ లోకానికి సందేశమిచ్చారు… స్వస్తి…..

Advertisement

తాజా వార్తలు

Advertisement