సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ కి ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. దాంతో మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు చోటు చేసుకుంది.రాజకీయ సంక్షోభ పరిస్థితులను నివారించడంలో సంజయ్ రౌత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఆయన ఉద్ధవ్ ఠాక్రేకు కుడిభుజంలా వ్యవహరిస్తున్నారు. అధికార మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమిలో కొనసాగుతోన్న శివసేన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వస్తున్నారు. కాగా, అసమ్మతి ఎమ్మెల్యేలకు నాయకత్వాన్ని వహిస్తోన్న ఏక్నాథ్ షిండేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అస్సాం నుంచి జీవం లేకుండా వారు ముంబైకి చేరుకుంటారని విమర్శించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement