Saturday, November 23, 2024

ఆపిల్ స్కూల్లో రాష్ట్రస్థాయి కలాం సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్

మేడికొండూరు ఫిబ్రవరి 19(ప్రభా న్యూస్) మండల పరిధిలోని పేరేచర్ల గ్రామంలో కల ఆపిల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఆదివారం నాడు హైదరాబాద్ వారి తొమ్మిద వ రాష్ట్రస్థాయి కలాం సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్టు ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఏడు కేంద్రాలలో మూడు నుండి 10వ తరగతి వాళ్లకు నిర్వహించడం జరిగింది .ఈ టెస్ట్ పేపర్లు ఓఎంఆర్ షీట్లను స్కూల్ డైరెక్టర్ అజయ్ కుమార్ ఈ అభ్యాస ఫౌండర్ సీ.ఈ.వో ఫణి పవన్ మరియు జయభారత స్కూల్ డైరెక్టర్జై నేంద్ర రెడ్డి సి ఆర్ స్కూల్ రమణ రెడ్డి కొండవీడు స్కూల్ రమణారెడ్డి మరియు వివిధ స్కూలు డైరెక్టర్లు ప్రిన్సిపాల్ . ప్రిన్సిపాల్ లు ఈ ఓఎంఆర్ షీట్లను విడుదల చేయడం జరిగింది .అనంతరం ఆపిల్ స్కూల్ డైరెక్టర్ మాట్లాడుతూ ఈ పోటీ పరీక్షలకు వివిధ జిల్లాల నుండి 450 మంది విద్యార్థులు పాల్గొన్నారు అని ఆయన అన్నారు. ఈ ప్రతిభా పరీక్ష వలన పిల్లలలో మానసిక దృఢత్వం పెంపొందించబడి అనంతరం పోటీ పరీక్షల్లో పోటీపడి విజేతలుగా నిలవడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ అభ్యాస అకాడమీ సీఈవో డాక్టర్ పని పవన్ మాట్లాడుతూ ఈ పరీక్షలలో అత్యధిక ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ఏప్రిల్ 23వ తేదీన శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేయబడిన కార్యక్రమంలో ప్రముఖులచే ఈ పురస్కారాలు అందజేయబడతాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement