సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఐసీయులో చికిత్స పొందుతున్నారు. ఆయన స్పృహలోకి వచ్చారని తెలియగానే ఆయన్ని ట్రీట్ చేస్తోన్న క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి సహాయంతో సత్యనారాయణని ఫోన్లో పలకరించానని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఆయన త్వరగా కోలుకుంటారన్న పూర్తి నమ్మకం కలిగిందన్నారు. ట్రాకియాస్టోమి కారణంగా సత్యనారాయణ మాట్లాడలేకపోయినా..మళ్ళీ త్వరలో ఇంటికి తిరిగిరావాలని, ఆసందర్భాన్ని అందరం సెలబ్రేట్ చేసుకోవాలని నేను అన్నప్పుడు సత్యనారాయణ నవ్వుతూ థంబ్స్ ఆఫ్ సైగ చేసి థ్యాంక్ యూ అని చూపించినట్టుగా డాక్టర్ తెలిపారన్నారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా రావాలని ప్రార్థిస్తూ ఆయన అభిమానులు,శ్రేయాభిలాషులందిరితో ఈ విషయం పంచుకోవటం సంతోమని చిరంజీవి ట్వీట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement