వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీపై పార్లమెంట్ లో అనర్హత వేటు వేయడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.ఈ వేటు అప్రజాస్వామికమని మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా.. రాహుల్ గాంధీకి మద్దతుగా ఆదివారం సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా సంకల్ప్ సత్యాగ్రహ పేరుతో నిరసన ప్రదర్శనలు చేపట్టింది.ఢిల్లీలోని రాజ్ ఘాట్ దగ్గర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసింది. మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలతో పాటూ పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు దీక్షలో కూర్చున్నారు.అయితే, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయనే కారణంతో పోలీసులు ఈ దీక్షకు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ దీక్ష కొనసాగిస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement