Tuesday, November 19, 2024

సకల సౌందర్యరాశి… జగన్మాత!

(నిన్నటి తరువాయి)

ఇక ఆదిశంకర విరచిత శ్రీ ”అన్నపూర్ణాష్టకమ్‌” ”శ్రీ దుర్గాస్తో త్రనిధి” అన్న పుస్తకములో లభ్యం. శంకరులు, చివర, తా ను శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యులైన శ్రీ గోవింద భగవ త్పాదుల శిష్యునిగా చెప్పుకున్నారు. ”న గురోరధికమ్‌” అని నిరూ పించినారు.
ఈ స్తోత్రములో తల్లిని శంకరులు ”భింక్షాందేహి”అని అడు గుతున్నారు. అది భౌతిక లౌకిక భిక్ష కానే కాదు. వైరాగ్య శేముషీ భిక్ష. అమ్మవారిని ”నిత్యానందకరీ!” అన్న సంబోధనతో ప్రారంభిస్తారు. ”యోగానందకరీ!” అంటారు. ”నిగమార్థ గోచరకరీ!” అని స్తుతి స్తారు. ”విజ్ఞాన దీపాంకురీ” అని పిలుస్తారు. ‘సాక్షాన్మోక్షకరీ’ అని ఆక్రోశిస్తారు. చివరగా స్తోత్రం యొక్క సారాన్ని యిలా చెబుతారు శంకర భగవత్పాదులు-
”అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చపార్వతీ!”
”జ్ఞాన వైరాగ్యములనే భిక్షను ప్రసాదించు జననీ!”
”స్వదేశో భువనత్రయమ్‌” అని ముగిస్తారు శంకరులు. ”ఆత్మ వత్‌ సర్వభూతాని” అన్నది కూడ! పార్వతీ పరమేశ్వరులు ఏక శరీర గతులు. వారికి అభేదము. దీనినే కాళిదాసుల వారు తమ రఘువం శ కావ్యపు అవతారికలో-
”వాగర్ధా éవివ సంపృక్తౌ, వాగర్ధ ప్రతిపత్తయే
జగత: పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ”
అని వినుతించారు. ఎంత భావస్ఫోరకమైన మాటలు! ”వా క్కు, అర్థము వలె బద్ధులైన, జగత్తుకు తల్లిదండ్రులైన, పార్వతీపర మేశ్వరులకు నమస్కారము!” శార్దూల వృత్తములలో సింహవాహి నిని స్తుతించడం ఎంతైనా ఔచిత్య శోభితం.
ఇక శ్రీరాజరాజేశ్వర్యష్టకంలో అమ్మవారిని ‘చిద్రూపా’, ‘పర దేవత’గా ఆవిష్కరించినారు. ఆమె ”ఆనంద సంధాయిని” అట ”ఆ ర్యాణి” తల్లి! ‘ఓంకారీ!’ ఆర్యామహాదేవత. దీనినే పోతనగారు తమ రుక్మిణీ కల్యాణములో ”ఆర్యామహాదేవియున్‌” అని వాడారు. ఆమె ప్రణవాది రేఫజనని, చిత్కళామాలిని. ఇలా ఎన్నని ఎన్నగల ము అమ్మవారి రూపాలను.
ఇక ఆదిశంకరులవారే రచించిన, జగన్మాతను ‘సౌందర్యలహ రి’గా సాక్షాత్కరింప చేసిన అపురూప స్తోత్రంలో 103 శ్లోకాలున్నా యి. అన్నీ ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లేవే! తల్లి త్రిపురసుం దరి. ఆమె దయనే సౌందర్యముగా అభివర్ణించారు పరివ్రాజకస్వా మి. ‘సౌందర్యలహరి’లో మూడు అంశాలున్నాయి. అది మంత్ర ము, తంత్రము, కావ్యము. దీనిలో రెండు భాగాలుంటాయి. మొద టి 41 శ్లోకములు ‘ఆనందలహరి’ , 42- 100 శ్లోకములు సౌందర్యల హరి. ఇవికాక మూడు శ్లోకములు ప్రక్షిప్తములు.
మొదటి భాగంలో శంకరులు దేవతత్త్వ రహస్యమును విశదీక రించినారు. సౌందర్యలహరిలో ”సౌ”, ‘లహ’, ‘హ్రీం’ అను బీజాక్ష రాలున్నాయని విజ్ఞులు అంటారు. ఈ స్తోత్రం ‘శిఖరిణీ వృత్తం” అనే ఛందస్సులో స్వామి రచించారు. దీనిలో, శంకరుల వర్ణనా చాతు ర్యం అనన్య సామాన్యం. ఆగమతంత్రాలు, శ్రీవిద్య ఇందులో వివ రించబడినాయి.
సౌందర్యలహరికి దాదాపు 50 వ్యాఖ్యానాలు ఉన్నాయి. వ్యా ఖ్యాతలలో కామేశ్వరసూరి, అచ్యుతానందులు మొదలగువారు ముఖ్యులు.
”కుండలినీ శకి”్తని గురించి ”ా|సూ|nష ూుూ|స” పేరిట, ‘ఆనందలహరి’కి ”అర్ధర్‌ ఎవలాన్‌” అను ఆంగ్లేయుడు ఇంగ్లీషులో వ్యాఖ్యానం వ్రాశాడు. అలాగే, ‘శ్రీరామకవి’ వ్రాసిన ‘డిండిమ భాష్యము’, ‘శ్రీ నరసింహస్వామి’ రాసిన ”గోపాల సుందరీయ ము”, శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారి ”శ్రీచక్ర విలసన ము” ఎన్నతగిన వ్యాఖ్యలు.
‘సౌందర్యలహరి’లో ‘శ్రీచక్రము’ గురించి 11వ శ్లోకంలో చెప్పారు శంకరులు. మొదటి శ్లోకంలో తన వినయ సంపదనంతా ప్రదర్శించారు స్వామి.
చివరగా పోతన గారి పద్యంతో ముగిద్దాం.
ఉ|| అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాల పె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడిపుచ్చినయమ్మ, దన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్త్వ పటుత్త్వ సంపదల్‌
ఈ పద్యాన్ని, ఈ మధ్య విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి వెళ్లినపుడు ఆలయ రాజద్వారం పైన లభించి ఉండగా చూశాను. మా బావగారు, డా|| శ్రీనివర్తి విద్యాసాగర్‌ గారు దీనిని ఆధ్యాత్మికంగా వివరించిన ఒక ”రైటప్‌”ను నాకు పంపారు. దాని కర్త ఎవరో తెలియదు. వారికి నా పాదాభివందనం. వారి స్ఫూర్తితో మీకు ఈ క్రింది విషయాలు తెల్పుకుంటున్నాను.
పైకి అతి సులభంగా కనపడే పద్యం! మనం శ్రీ చక్రాన్ని నిత్యం పూజించలేము. బీజాక్షరాలను జపించి, అమ్మవారిని ఉపాసన చెయ్యలేము. ”అమ్మలగన్నయమ్మ” ఈ అమ్మలు ఎవరు? లలితా సహస్ర నామాలలో ”శ్రీమాతా” అనే నామం మొదటిది. దీనిలో, ‘శ’, ‘ర’, ‘ఈ’ కారములున్నాయి. అవి, సత్త్వ. రజస్తమో గుణముల కు ఆధిదేవతలైన రుద్రాణి, లక్ష్మి, సరస్వతి. వీరు ముగ్గురిని త్రి మూర్తులకు కనియిచ్చిన అమ్మ. ఆమే ‘లలితాపరాభట్టారిక” ఆమె సాక్షాద్దుర్గా స్వరూపిణి పై ముగ్గురికి మూలమైన అమ్మ దుర్గమ్మ!
”చాల పెద్దమ్మ” అన్నారు పోతనగారు. ఇది చాలా పెద్ద, విస్తృ తార్థాన్నియిస్తుంది. దీనికి అర్థం, అండపిండ బ్రహ్మాండములంతా నిండిన మహాశక్తి. సమస్త జీవరాశులలోనూ నిండి ఉంది తల్లి. అదే మాతృత్వం. అదే అవాజ్య కరుణ. ఆ దయనే సౌందర్యం అంటారు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి.
”ఈశ్వరమ్మా, నిన్నెనమ్మితీ, భూలోక జననీ,
మముగన్నతల్లిd, ఈశ్వరమ్మా, నిన్నె నమ్మితీ!
ఈశ్వరమ్మవు నీవెగాగ మోక్షమీయ ఎవరితరమూ!”
అని వీరబ్రహ్మేంద్ర స్వామివారు కీర్తన వ్రాశారు. మా రాయ లసీమలో సాధువులు దీనిని పాడుతూ ఇల్లిల్లూ తిరుగుతారు. భజన ల్లో గూడ ఇది ప్రసిద్ధం. జనం నోళ్లలో నిత్యం నానే గానం!
ఇక ”సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ” సురారి- దేవతలకు శత్రువు. వాళ్లకు అమ్మ ‘దితి’ ఆమెకు కడుపారడి అంటే దు:ఖం మిగిల్చింది అమ్మ. రాక్షసులను దునుమాడి!
”తన్నులోనమ్మిన వేల్పుటమ్మలు” అష్టమాతృకలు. వారే బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారా హి, మహాలక్ష్మి వీరు శ్రీచక్రంలో కొలువు తీరి ఉంటారు. వీరి మనస్సులో కొలువై ఉంటుంది దుర్గమ్మ. ‘దేవీ భాగవతం’లో వ్యాసుల వారు ఇలా అంటారు.
”రక్తాంబరాం, రక్తవర్ణాం, రక్తసౌభాగ్య సుందరాం
వైష్ణవీం శక్తిమద్భుతామ్‌” ‘శాక్తేయ ప్రణవములు’ అంటే ”ఓం-ఐం-హ్రీం-శ్రీం- క్లీం- సౌ:” ఈ ఆరు బీజాక్షరాలు మనం శ్రమపడి వీటిని జపించనవసరంలేదు. మనం ఎక్కడ ఉన్నా పోతన గారి ”అమ్మలగన్నయమ్మ” పద్యాన్ని చదువుకుంటే చాలు! తల్లి మనల్ని కరుణిస్తుంది. అతి సామాన్యులను కూడా అమ్మ వారికి చేరువ చేసే అనర్ఘ పద్యమిది.
జయజయ దుర్గే!
శ్రీ చక్ర సంచారిణీ!

Advertisement

తాజా వార్తలు

Advertisement