Wednesday, December 18, 2024

Real Estate Fraud | ఈడీ కస్టడీకి సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ..

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : ఫ్రీలాంచ్‌ పేరుతో వందలాది మంది వినియోగదారులకు కుచ్చుటోపీ పెట్టిన సాహితీ ఇన్‌ఫ్రా మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.లక్ష్మీనారాయణను ఈడీ కస్టడీలోకి తీసుకునేందుకు నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. గత నెల 29న లక్ష్మీనారాయణను అరెస్టు చేసిన ఈడీ అధికారులు దర్యాప్తులో భాగంగా 10 రోజుల కస్టడీకి అనుమతించాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు.

కాగా లక్ష్మీనారాయణను ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీతో ఈ నెల 14 నుంచి 18 వరకు ఈడీ కార్యాలయంలో దర్యాప్తు కొనసాగనుంది. ఫ్రీలాంచ్‌ పేరుతో వినియోగదారుల నంచి సాహితీ ఇన్‌ఫ్రా భారీ ఎత్తున డబ్బు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

ఫ్రీ లాంచ్‌ స్కాంపై :

సాహితీ ఇన్‌ ఫ్రా ఎండీ 9 ప్రాజెక్టుల పేరుతో సుమారు 700 మంది నుంచి రూ.360 కోట్ల వసూలు చేసినట్లుగా ఈడీ ఆరోపించింది.

అందులో సాహితీ సితార పేరుతో రూ.135 కోట్లు, సిస్టా అడోబ్‌ పేరుతో రూ.79 కోట్లు, సాహితీ గ్రీన్‌ పేరుతో రూ.40 కోట్లు, సాహితీ మెహతో పేరుతో రూ.44 కోట్లు, ఆనంద ఫర్చూన్‌ పేరుతో రూ.45 కోట్లు, సాహితీ కృతి పేరుతో రూ.16 కోట్లు, సాహితీ సుదిక్ష పేరుతో రూ.22 కోట్లు, రూబికాన్‌ సాహితీ పేరుతో రూ.7 కోట్లు, సాహితీ స్వాద్‌ పేరుతో రూ.65 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ విచారణలో తేలింది.

- Advertisement -

అయితే నిందితుడు లక్ష్మీనారాయణ తన వ్యక్తిగత అవసరాలకు ఈ మొత్తాలను వాడుకున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా సాహితీ ఇన్‌ఫ్రాకు సంస్థకు చెందిన రూ.161 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement