Tuesday, November 26, 2024

నేటి నుంచి రూ.2వేల కరెన్సీ నోట్ల మార్పిడి ప్రారంభం

న్యూ ఢిల్లీ – రూ.2వేల కరెన్సీ నోటును చలా మణి నుంచి పూర్తిగా ఉపసంహరిస్తున్నట్లు ఆర్‌బీఐ గత శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో వీటిని మార్చుకునేందుకు ప్రజలకు అవకాశం కల్పిస్తున్నారు. బ్యాంకులో ఒక దఫా రూ.20 వేల పరిమితి వరకు.. అంటే రూ.2వేల నోట్లు 10.. ఇతర డినామినేషన్లలోకి మార్చుకునేందుకు నేటి నుంచి షురూ చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఈ ఎక్స్చేంజ్‌ చేసుకోవచ్చు.

సెప్టెంబర్‌ 30 వరకు.

.క్లీన్‌ నోట్‌ పాలసీ ప్రకారం రూ.2వేల కరెన్సీ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయి ంచారు. అయితే ఈ నోట్లను ఖాతాలో డిపాజిట్‌ చే సుకోవడానికి, లేదా బ్యాంకులో మార్చుకోవడానికి నేటి నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ప్రజలకు అవకాశం కల్పించారు. బ్యాంక్‌లో అకౌంట్‌ కలిగి ఉన్నవారు ఎవరైనా నేరుగా సమీప బ్యాంక్‌లో నోట్లను మార్చుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

రెగ్యులర్‌ కౌంటర్లే..

బ్యాంకుల్లో నోట్ల మార్పిడికి సంబంధించి ప్రస్తుతానికైతే రోజువారీగా జరిగే రెగ్యులర్‌ కౌంటర్లలోనే చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒకవేళ రద్దీ ఉంటే మాత్రం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరిస్తున్నారు.

డిపాజిట్‌ ఇప్పటికే మొదలు..

నిర్ణయం వెలబడి నాలుగు రోజులు గడవగా నోట్ల మార్పిడికి ఆర్‌బీఐ మంగళవారం నుంచి అవకాశం కల్పిస్తుంది. డిపాజిట్లకు సంబంధించి ఇప్పటికే మొదలు పెట్టినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఏ మేరకు రూ.2వేల నోట్లు బ్యాంకులకు చేరాయనే సంఖ్య మాత్రం అధికారులు చెప్పడం లేదు. ఈ విషయంలో గోప్యత పాటిస్తున్నారు మార్పిడికి ఎలాంటి నిబంధనలు లేవు. ఎవరైనా ఒక దఫా రూ.20వేల వరకు నోట్లను ఎక్స్చేంజ్‌ చేసుకోవచ్చు

Advertisement

తాజా వార్తలు

Advertisement