రోడ్డుపై రూపాయి కనిపిస్తేనే వదలం..అలాంటిది నోట్లకి నోట్లు కనిపిస్తే ఊరుకుంటామా..దొరికినంత దోచుకొని పారిపోతాం. అచ్చు అలాగే జరిగింది అమెరికాలో దక్షిణ కాలిఫోర్నియాలోని ఫ్రీవే రహదారిపై. డబ్బుతో ఓ కంటైనర్ రోడ్డుపై వెళ్ళుతోంది. మార్గమధ్యంలో కంటైనర్ డోర్ తెరుచుకోవడం నోట్ల సంచులు కిందపడ్డాయి. వాటిలోని డబ్బులు రోడ్లపై చెల్లా చెదురుగా పడిపోయాయి.అటుగా వచ్చిన వారు రోడ్డుపై ఉన్న నోట్లను తీసుకోని తమ జేబుల్లో వేసుకున్నారు. శాన్‌డిగో నుంచి కాలిఫోర్నియాలోని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కార్యాలయానికి డబ్బు సంచులతో బయలుదేరిన వాహనం తలుపు మార్గమధ్యంలో అకస్మాత్తుగా తెరుచుకుంది. దాంట్లోని డబ్బుల కట్టలు కిందపడి అవి రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
దాంతో అటుగా వచ్చినవారు తన జేబుల్లో వేసుకొని మెల్లిగా జారుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మార్గంపై వాహనాలను నిలివేశారు.. వాహనదారులను అడ్డుకున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆదేశించడంతో కొందరు ఇచ్చేశారు. కానీ మరికొందరు పోలీసుల కళ్లుకప్పి పారిపోయారు. డెమీ బాగ్బీ అనే బాడీ బిల్డర్ ఈ దృశ్యాలన్నీ ఫోన్‌లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. డబ్బు తీసుకున్నవారు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సమీపంలోని సీసీటీవీ లను పరిశీలిస్తున్నారు పోలీసులు. డబ్బు దొరికితే ఎవరైనా ఇస్తారా..చూడాలి మరి ఏమవుతుందో..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..