సమైక్య పాలనలో నిరాదరణకు గురైన ఆలయాలను తెలంగాణ ప్రభుత్వం పునరుద్దణకు కృషి చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం రేకుర్తి గుట్టపై నూతనంగా నిర్మిస్తున్న లక్ష్మి నర్సింహా స్వామి ఆలయ పునరుద్దరణ పనులను పరిశీలించారు.. పనులు జరుగుతున్న తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.. ఈనెల 24న ఆలయ గోపురం గడప కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడించారు..ఘాట్ రోడ్డు పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకుని.. నెలన్నర రోజుల్లోగా పనులు పూర్తి చేసి స్వామి వారి దర్శనానికి సిద్దం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రాచీన ఆలయాలకు పూర్వవైభవం తీసుకువస్తామన్నారు. ఇందుకోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడబోమన్నారు. రేకుర్తిలోని లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని యాదాద్రికి ధీటుగా గొప్పక్షేత్రంగా తీర్చిదిద్దుతానని పునరుద్ఘాటించారు. సమైక్య పాలనలో ఆలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆలాంటి ఆలయాలకు, స్వయం పాలనలో పూర్వవైభవం తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే యాదాద్రిని సౌత్ ఇండియాలోనే గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దామని… ఇప్పుడు కొండగట్టు ఆలయాన్ని అభివృద్ది చేసేందుకు ఎన్నికోట్లైనా వెచ్చించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. కరీంనగర్ రేకుర్తిలోని గుట్టపై స్వయంభువుగా వెలిసిన లక్ష్మినరసింహ స్వామి ఆలయాన్ని గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. లక్ష్మీ నరసింహ స్వామి చాలా చోట్లో వెలిశారని, స్వామి వారికి చాలా చోట్ల ఆలయాలున్నాయన్నారు. కానీ రేకుర్తిలో వెలిసిన స్వామి వారు చాలా పవర్ ఫుల్ అని అన్నారు. వెయ్యి సంవత్సరాల క్రితమే ఇక్కడ స్వామి వారు శంఖు చక్రాలతో… సుదర్శన చక్రం కూడా స్వయంభువుగా వెలిసిన మహిమాన్వితమైన ఆలయమన్నారు. ఆలయ నిర్మాణం కోసం నిధులను కెటాయించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
యాదాద్రి తరహాలో రేకుర్తి లక్ష్మీనర్సింహా స్వామి ఆలయాన్ని తీర్చిదిద్దుతా : మంత్రి గంగుల
Advertisement
తాజా వార్తలు
Advertisement