Saturday, November 23, 2024

అశేష జనవాహిని మధ్య రామిశెట్టి కృష్ణయ్య అంతిమయాత్ర

గంపలగూడెం, కమ్యూనిస్టు పార్టీ యోధుడు,స్వాతంత్ర్య సమర యోధుడు,కామ్రేడ్ రామిశెట్టి కృష్ణయ్య (97)అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతి చెందారు. మండలంలోని ఊటుకూరు స్వగ్రామంలో గురువారం అతని భౌతికకాయాన్ని సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శిణి అక్కినేని వనిజ పాల్గొని నివాళుర్పించి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు పార్టీకి చెందిన తూము కృష్ణయ్య, చిలుకూరి వెంకటేశ్వరావు,కొత్తపల్లి సుందరరావు,యస్.కె.నాగుల్ మీరా,సిద్ధి వైకుంఠరావు,మల్లాది కృష్ణ,టీడీపీ నాయకులు చెరుకూరి రాజేశ్వరరావు,మండల టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు యస్.కె.బాబు,ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి దద్దనాల రాంబాబు,గ్రామ సర్పంచ్ బొల్లేపోగు రేణుఖ,ఉప సర్పంచ్ సంగీతం రాఘవయ్య,వైకాపా నాయకులు ఆలపాటి ఉమామహేశ్వరరావు,బొల్లా కరుణాకర్ రావు, సీపీఎం మండల కార్యదర్శి గువ్వల సీతారామిరెడ్డి, నాయకులు చెరుకూరి రాధాకృష్ణమూర్తి,నందిగామ జనార్దన చారి,చెరకు వీరారెడ్డి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మేడా సురేష్,మండల అధ్యక్షుడు ఎడ్లపల్లి రామకృష్ణ, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పఠాన్ బాబు,మాజీ మండల కో అప్షన్ సభ్యుడు యస్.కె.గుంటూరు,మోదుగు దానియేలు,తిరువూరు మాజీ జడ్పీటీసీ సభ్యులు గద్దె రమణ,భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యస్.కె.ఉమ్మరవలి,భవన నిర్మాణ కార్మికులు యస్.కె.నవాబు,గుంతా వెంకటేశ్వరావు,జక్కుల కృష్ణ,మండలంలోని వివిధ గ్రామాల నుండి పలు పార్టీల నాయకులు,ప్రజా సంఘాల నాయకులు గద్దల అదాం, మోదుగు లక్ష్మణరావు,గ్రామస్తులు,అభిమానులు, తదితరులు సందర్శించి ఘనంగా నివాళులర్పించారు అనంతరం అశేష జనవాహిని మధ్య జోహార్ కామ్రేడ్ రామిశెట్టి కృష్ణయ్య అనే నినాదంతో అంతిమయాత్ర నిర్వహించారు కామ్రేడ్ రామిశెట్టి కృష్ణయ్య తన 17వ సంవత్సరంలోనే భారత కమ్యూనిస్టు పార్టీలో చేరి తన నమ్మిన సిద్ధాంతం మేరకు తుది శ్వాస వరకు పార్టీలోనే కొనసాగారు ప్రజల పక్షాన ఎన్నో ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొని నాయకత్వం వహించారు స్వాతంత్ర్య ఉద్యమంలోనూ మరియు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ సాయుధ పోరాటంలో ముఖ్య భూమిక పోషించారు పార్టీలో వివిధ హోదాలలో పనిచేసి కమాండర్ గా గుర్తింపు పొందారు మరియు ఊటుకూరు సొసైటీ అధ్యక్షులుగా చేసి సహకార సంఘం అభివృద్ధికి కృషి చేసారు ఎంపీటీసీగా చేసి విలువలతో కూడిన రాజకీయాల్లో కొనసాగి మచ్చ లేని నాయకులుగా ప్రజల ఆదరాభిమానాలు పొందారని పలువురు గుర్తుచేసుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement