Monday, December 23, 2024

Pushpa-2 | రెండు రోజుల్లోకే బాక్పాఫీస్ విధ్వంసం…

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రం తొలిరోజు కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.449 కోట్లు వసూలు చేసిందని మేకర్స్ వెల్లడించారు. ఈ మైలురాయిని అత్యంత వేగంగా సాధించిన భారతీయ చిత్రంగా ‘పుష్ప-2’ నిలిచిందని మేకర్స్ తెలిపారు.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ విధ్వంసకర నటనకు ప్రేక్షకులు విజిల్స్ వేస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement