మణికొండ మున్సిపాలిటీ పరిధి తనీషా నగర్ లో అంబియన్స్ కోర్ట్ యార్డ్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ఆ నివాస సముదాయం నుండి మురుగు నీటిని రాత్రి సమయంలో రోడ్డుపై వదులుతున్నారు. దీంతో ఆనీరు హుడా కాలనీ, ఎంప్లాయిస్ కాలనీ నివాస గృహాలకు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనిపై కాలనీల వాసులు నిరసన వ్యక్తం చేశారు.
అంబియన్స్ కోర్ట్ యార్డ్ యాజమాన్యం ఇలా మురుగునీటిని వదలడం సరైంది కాదన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో తానేష్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, ఎంప్లాయిస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎస్బి రాజశేఖర్, బీ ఈరన్న, సుగుణ రాజు, ప్రభు జి, ఎమ్మెస్సాన్ మూర్తి, హారజాత్ అయ్యా, వాహిద్ ఖాన్, ఇక్బాల్, ఎం.పెంటారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -