చేనేత, హస్తకళలను ప్రోత్సహించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్ఎస్ గార్డెన్స్‌లో కళా భారతీ చేనేత, హస్తకళ మేళాను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా మేళాలో ప్రదర్శించిన చేనేత వస్త్రాలు, హస్తకళల వస్తువులను తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత రంగాన్ని, హస్తకళ రంగాన్ని కాపాడుకునేందుకు ఇలాంటి ప్రదర్శనలు దోహదపడతాయన్నారు. పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన మెగా మేళా ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అమ్రీశ్, నాయకులు అక్కపాక తిరుపతి, రహీమ్, మేళా నిర్వాహకులు జల్ల సత్యనారాయణ, శనిగరం కిశోర్, మూల కృష్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement