టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఇక సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బాలకృష్ణ ఆల్ టైమ్ సూపర్ హిట్ సినిమా నారీ నారీ నడుమ మురారి టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ చేతుల మీదుగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు..
ఇద్దరు భామలు అరుస్తుంటే.. శర్వానంద్ మధ్యలో నలిగిపోతూ చెవులు మూసుకోవడం ఫస్ట్ లుక్‌లో చూడొచ్చు. ఈ చిత్రంలో భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్, ఏజెంట్ ఫేం సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే సంయుక్తా మీనన్ దియా పాత్రలో నటిస్తుండగా..ఈ భామ సంప్రదాయ నృత్య భంగిమలో ఉన్న స్టిల్ ఒకటి ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది.
- Advertisement -