Friday, November 22, 2024

National : మూడు రాష్ట్రాల్లో పీఎం మోదీ పర్యటన… పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు…

పీఎం మోదీ రెండు రోజుల పాటు బిజీ బిజీగా గడపనున్నారు. వరుసగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇవాళ, రేపు మూడు రాష్ట్రాల్లో ఆయన పర్యటించునున్నారు.

నేటి ఉదయం కేరళలోని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించనున్నారు. స్పేస్ సెంటర్‌ను సందర్శించిన సందర్భంగా మూడు ముఖ్యమైన అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. ఇక, దేశంలోని అంతరిక్ష రంగాన్ని దాని పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడానికి, ఈ రంగంలో సాంకేతిక, పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రధాని మోడీ పాటు పడుతున్నారు.

- Advertisement -

తిరువనంతపురం నుంచి ఇవాళ సాయంత్రం తమిళనాడులోని మధురైలో ‘క్రియేటింగ్ ది ఫ్యూచర్.. డిజిటల్ మొబిలిటీ ఫర్ ఆటోమోటివ్ MSME ఎంటర్‌ప్రెన్యూర్స్’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఇక, రేపు (ఫిబ్రవరి 28న) ఉదయం 9:45 గంటలకు, తమిళనాడులోని తూత్తుకుడిలో దాదాపు రూ. 17,300 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.

అలాగే, రేపు సాయంత్రం 4:30 గంటలకు, ప్రధానమంత్రి మహారాష్ట్రలోని యవత్మాల్‌లో బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు.. అక్కడ రూ. 4,900 కోట్ల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, దేశానికి అంకితం చేయనున్నారు. ఇక, ఈ పథకం కింద మహారాష్ట్రలోని ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు సంవత్సరానికి రూ. 6000 అదనంగా పొందుతారు. దీంతో పాటు మహారాష్ట్రలోని 5.50 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జీ) రూ. 825 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ను కూడా ప్రధాని పంపిణీ చేయనున్నారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) కింద భారత ప్రభుత్వం అందించిన రివాల్వింగ్ ఫండ్‌కు ఈ మొత్తం అదనం అని చెప్పొచ్చు.

అయితే, గ్రామీణ స్థాయిలో మహిళల నేతృత్వంలోని సూక్ష్మ సంస్థలను ప్రోత్సహించడం ద్వారా పేద కుటుంబాల వార్షిక ఆదాయాన్ని పెంచడానికి ఈ రివాల్వింగ్ ఫండ్ అందించబడుతుంది. మహారాష్ట్రలో కోటి ఆయుష్మాన్ కార్డుల పంపిణీని కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. మహారాష్ట్రలో ఓబీసీ కేటగిరీ లబ్ధిదారుల కోసం ప్రధాని మోడీ ఆవాస్ యోజనను స్టార్ట్ చేయనున్నారు. ఈ పథకం కింద మొదటి విడతగా రూ.375 కోట్లను 2.50 లక్షల మంది లబ్ధిదారులకు బదిలీ చేయనున్నారు. ఇది మాత్రమే కాదు.. మహారాష్ట్రలో రూ. 1,300 కోట్లకు పైగా విలువైన పలు రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement